Mona Lisa Kumbh Mela: సోషల్ మీడియా వల్ల.. ఆమె ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయింది. నీలికళ్ళతో కళ్ళతో.. జిగేల్ మనిపించే రూపంతో.. పూసలు అమ్ముకునే ఆమెను సోషల్ మీడియా నెత్తికెత్తుకుంది. మీడియా కూడా అదే స్థాయిలో కవరేజ్ ఇచ్చింది. దీంతో మోనాలిసా ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది. ఫలితంగా సోషల్ మీడియా, మీడియా ఆమె వెంట పడటంతో పూసలు అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కుంభమేళా నుంచి ఇంటికి ఉత్తి చేతులతో వెళ్లక తప్పలేదు. మోనాలిసాది పేద కుటుంబం. ఎప్పటినుంచో వారి కుటుంబం పూసలు అమ్ముకుంటూ జీవిస్తోంది. అయితే ఈసారి సోషల్ మీడియా కంటపడటం.. ప్రధాన మీడియా కూడా ఆమె మీద ఫోకస్ చేయడంతో సెలబ్రిటీ అయిపోయింది. ఇదే సమయంలో ఆమెకు సినిమా ఆఫర్లు వచ్చాయని.. ఆమె బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోందని.. కొంతమంది దర్శకులు కూడా ఆమెతో సంప్రదింపులు జరిపారని.. తెలుగులో కూడా ఆమె నటించే అవకాశం ఉందని.. ఇలా రకరకాలుగా ప్రచారాలు జరిగాయి. అయితే అవన్నీ కూడా గాలికి కొట్టుకుపోయిన పేలపిండి సామెతను నిజం చేసి చూపించాయి. అయితే పూసలు అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో.. మోనాలిసా తిరిగి ఇంటికి వచ్చింది. అయితే ఇదే సమయంలో ఆమె చేసిన ఒక అభ్యర్థన.. కంటనీరు పెట్టిస్తోంది.
Instagram hack చేశారట…
మోనాలిసా.. పేద కుటుంబంలో పుట్టినప్పటికీ.. పైసా పైసా కూడబెట్టుకొని ఒక స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసింది. అందులో Instagram account open చేసింది. అందులో రీల్స్ చేస్తూ.. భారీగానే ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.. ఈ క్రమంలో మహా కుంభమేళాలో ఆమె కనిపించడం.. ఓవర్ నైట్ సెలబ్రిటీ కావడంతో చర్చ మొత్తం ఆమె చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. అయితే తను వాడే Instagram ను ఎవరో హ్యాక్ చేశారట. ఈ విషయాన్ని మోనాలిసానే స్వయంగా చెప్పింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది..” నేను ఓ చిన్న ఇంట్లోనే నివాసం ఉంటున్నాను. మా ప్రాంతం పరిధిలో వందమంది మాత్రమే నివసిస్తారు.. పూసలు అమ్ముకోకుండానే ఇంటికి తిరిగి వచ్చేసరికి నిరాశగా ఉంది. నన్ను సెలబ్రిటీని చేయడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. పైగా నా Instagram account ను ఎవరో హ్యాక్ చేశారు. దయచేసి తిరిగి ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానని” మోనాలిసా పేర్కొంది.. అయితే దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమెకు జీవన భృతి లేకుండా చేశారని.. చివరికి Instagram account ను కూడా hack చేశారని మండిపడుతున్నారు. వెంటనే ఆమె అకౌంట్ ను ఆమెకు తిరిగి ఇచ్చేయాలని కోరుతున్నారు.
ఆకర్షించే నేత్రాలతో మహా కుంభమేళాలో కనిపించిన మోనాలిసా Instagram account hack అయ్యింది. చివరికి ఆమె పూసలమ్ముకోకుండా ఇంటికి వెళ్లేలా చేసింది.. అయితే తన Instagram hack చేశారని.. దానిని తిరిగి ఇవ్వాలని ఆమె వేడుకుంటున్నది. #monalisa#mahakumbhmela pic.twitter.com/ywXAKiUiac
— Anabothula Bhaskar (@AnabothulaB) January 26, 2025