Bollam Mallaiah Yadav : రోజురోజుకు రాజకీయ నాయకులలో పరిణితి అనేది మాయమవుతుంది. మాటల దగ్గర నుంచి చేతుల వరకు ఇలా ప్రతి విషయంలోనూ రాజకీయ నాయకులు నేల బారుతనాన్ని ప్రదర్శిస్తున్నారు. జనాలు ఏమనుకుంటారు, మీడియా ఎలా స్పందిస్తుంది అనే విషయాలను పక్కనపెట్టి.. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో కవిత రోజుకు ఒక సంచలన వ్యాఖ్యలతో వార్తలలో నిలుస్తున్నారు. భారత రాష్ట్ర సమితి అధినాయకత్వంపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కెసిఆర్ నుంచి మొదలు పెడితే హరీష్ రావు వరకు ఎవరిని కూడా ఆమె వదిలిపెట్టడం లేదు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు భారత రాష్ట్ర సమితి చేసిన తప్పులను ఆమె ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. కుటుంబ సభ్యులను ఇందులో దాచుకోవడం లేదు. పైగా తను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. సోమవారం శాసనమండలిలో జరిగిన సమావేశంలో కల్వకుంట్ల కవిత భావోద్వేగంతో మాట్లాడారు. ఇదే క్రమంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏం పీకి కట్టలు కట్టామని జాతీయస్థాయిలోకి వెళ్తున్నామని ప్రశ్నించారు.
ఏబీఎన్ వెంకట్ కృష్ణ గారికి డిబేట్ లో ముప్పుతిప్పలు పెట్టిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.
పలుమార్లు పిలిచిన పలకని వైనం. మద్యం మత్తులో ఉన్న మాజీ ఎమ్మెల్యే. మళ్లీ కలుపుతారు అని చెప్పేసరికి వినపడుతోంది అని బదులు ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే.
తాగడం దేనికి ? డిబేట్ కు… pic.twitter.com/06JDRVbBmk
— Vennela Kishore Reddy (@Kishoreddyk) January 5, 2026
కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఏబీఎన్ ఛానల్ సోమవారం రాత్రి ఒక డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ కు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హాజరయ్యారు. అనివార్య కారణాల వల్ల ఆయన ఇంటి వద్ద నుంచి డిబేట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మద్యం తాగుతూ కనిపించారు. మొదట్లో గాజు గ్లాసులో కలిపి ఉంచిన మద్యాన్ని ఆయన తాగారు. ఆ తర్వాత చూసే ప్రేక్షకులకు అనుమానం వస్తుందని దానిని స్టీల్ గ్లాసులోకి మార్చారు. సరిగ్గా దీనిని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ గుర్తించారు. ఇంకేముంది ఆ వీడియోను సర్కులేట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో బొల్లం మల్లయ్య యాదవ్ తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిని కవర్ చేయడానికి గులాబీ పార్టీ సోషల్ మీడియా రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే నష్టం జరిగిపోయింది కాబట్టి డ్యామేజ్ కంట్రోల్ సాధ్యం కాలేదు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో మల్లయ్య యాదవ్ కోదాడ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. నిత్యం వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో ఉండే మల్లయ్య యాదవ్.. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రిపై తీవ్రమైన పదజాలం వాడుతున్నారు. చివరికి కవితపై నిర్వహించిన డిబేట్లో కూడా ఆయన మద్యం తాగి మాట్లాడడం సంచలనం కలిగిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
మద్యం తాగుతూ డిబేట్ లో పాల్గొని జాగృతి కవిత పై ఆరోపణలు చేసిన కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లాయ యాదవ్…
దుమ్మెత్తి పోస్తున్న మహిళా సంఘాలు.
పార్టీ అధినేత బుద్ధులు ఎక్కడికి పోతాయి అని ఎద్దేవా చేస్తున్న నెటిజన్లు. pic.twitter.com/MfJcflHc2K— Vennela Kishore Reddy (@Kishoreddyk) January 5, 2026