Allu Arjun And Lokesh Kanagaraj: ప్రస్తుతం మన టాలీవుడ్ లో ప్రభాస్ ని మించిన క్రేజీ కాంబినేషన్స్ తో మూవీ లవర్స్ కి పిచ్చెక్కిస్తున్న హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun). ఇప్పటికే ఆయన ప్రముఖ తమిళ టాప్ డైరెక్టర్ అట్లీ తో ఒక సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతోంది. ఇందులో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు. ఇదొక సూపర్ హీరో కథ అని అందరు అంటున్నారు. అంతకు మించి ఈ చిత్రం గురించి ఎలాంటి సమాచారం లేదు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన మరో తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రీసెంట్ గానే ఒక వీడియో ద్వారా తెలిపారు మేకర్స్. ఇది కూడా సూపర్ హీరో కాన్సెప్ట్ తోనే తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
అల్లు అర్జున్ తో పుష్ప సిరీస్ తీసి పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దానిపై సోషల్ మీడియా లో గత రెండు మూడు రోజులుగా అనేక చర్చలు నడుస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా కోలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే, ఈ సినిమాలో హీరోయిన్ గా కాయదు లోహర్ ఎంపిక అయ్యినట్టు తెలుస్తోంది. డ్రాగన్ చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా నటించి, యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఈ హాట్ బ్యూటీ, రీసెంట్ గా విశ్వక్ సేన్ హీరో, అనుదీప్ KV కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఫంకీ’ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు ఏకంగా ఇంత పెద్ద మెగా ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందంటే, ఆమె అదృష్టం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అల్లు అర్జున్ సినిమా అంటే ఇకపై పాన్ వరల్డ్ సినిమా అన్నట్టే లెక్క. ఈ సినిమాతో కాయదు లోహర్ పాన్ వరల్డ్ ఆడియన్స్ కి పరిచయం అవ్వబోతుంది అన్నమాట. పొరపాటున సూపర్ హిట్ అయితే మాత్రం కాయదు లోహర్ ని అందుకునే హీరోయిన్ భవిష్యత్తులో ఎవ్వరు రాలేరని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తన ప్రతీ సినిమాలో సాంగ్స్ పై ఎంతో ప్రత్యేకమైన ద్రుష్టి పెడుతాడు. స్టార్ హీరోలలో అల్లు అర్జున్ కి ఉన్నంత మ్యూజిక్ టేస్ట్ ఏ హీరోకి కూడా లేదని అందరు అంటుంటారు. అలాంటి అల్లు అర్జున్ కి అనిరుద్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తోడైతే ఎలాంటి సెన్సేషనల్ మ్యూజిక్ వస్తుందో మీరే ఊహించుకోండి.
