Ram Pothineni: యంగ్ హీరోలలో స్టార్ లీగ్ లోకి వెళ్లేంత సత్తా, టాలెంట్ ఉన్నవారిలో ఒకరు రామ్ పోతినేని(Ram Pothineni). దేవదాస్, జగడం, రెడీ, మస్కా వంటి చిత్రాలు చేసిన రోజుల్లోనే రామ్ స్టార్ హీరోలతో సమానమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆ మార్కెట్ ని కాపాడుకోవడం లో మాత్రం విఫలం అయ్యాడు. ఆయన కెరీర్ ని ఒకసారి పరిశీలిస్తే ఒక హిట్టు , నాలుగు డిజాస్టర్ ఫ్లాపులు అన్నట్టుగా సాగుతూ వచ్చింది. స్క్రిప్ట్ సెలెక్షన్స్ సరిగా చేయకపోవడం వల్ల, మన చిన్నప్పుడే స్టార్ హీరో అవ్వాల్సిన రామ్ పోతినేని, ఇప్పటికీ మీడియం రేంజ్ హీరోల క్యాటగిరీలోనే ఉండాల్సి వచ్చింది. ఇది ఆయనలో ఉన్న గొప్ప టాలెంట్ కి అవమానకరం అనే చెప్పాలి. రీసెంట్ గా వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకున్న ఆయన, కాస్త తన ఇమేజ్ కి భిన్నంగా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే చిత్రం ద్వారా మన ముందుకొచ్చాడు.
ఈ సినిమా సక్సెస్ పై విడుదలకు ముందు రామ్ లో చాలా గట్టి నమ్మకం ఉండేది. విడుదల తర్వాత మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని కూడా సొంతం చేసుకుంది. కానీ అదృష్టం కలిసిరాక ఫ్లాప్ గానే మిగిలింది ఈ చిత్రం కూడా. దీంతో రామ్ పోతినేని కాస్త డైలమా లో పడ్డాడు. ఈ సినిమాకు ముందు ఆయన ఆర్కా మీడియా వర్క్స్ (బాహుబలి మేకర్స్) సంస్థ లో ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ని చేయడానికి ఒప్పుకున్నాడు. అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు చాలా సమయం తీసుకునేలా ఉందని రీసెంట్ గా సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్త. కారణం ఏమిటంటే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి, అదే విధంగా కంప్యూటర్ గ్రాఫిక్స్ కి చాలా సమయం అవసరం పడుతుందట.
దానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువ సమయం అవసరం అవుతుండడంతో రామ్ కొంతకాలం విరామం తీసుకొని వరల్డ్ టూర్ వెయ్యాలని ఫిక్స్ అయ్యాడట. అంటే ఈ ఏడాది లో రామ్ నుండి సినిమా రావడం కష్టమే. ఇకపోతే రామ్ కి ప్రస్తుతం 37 సంవత్సరాలు. ఎలాగో ఇప్పుడు గ్యాప్ దొరికింది కాబట్టి పెళ్లి చేసుకోవచ్చు కదా అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఆయన ప్రముఖ యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ భొర్సే తో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వినిపించాయి. ఇందులో ఎలాంటి నిజం లేదని భాగ్యశ్రీ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. కానీ రామ్ మాత్రం ప్రస్తుతం లవ్ లోనే ఉన్నాడట, మరి ఆయన ఎవరితో రిలేషన్ లో ఉన్నాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
