Koreans Slim Secret: ఎంత తిన్నా కొరియన్లు స్లిమ్ గా ఎందుకుంటారు? అసలేం తింటారు?

కొరియన్లు మాంసాహారం, శాఖాహారం అని తేడా లేకుండా అన్నింటినీ తింటారు. కానీ ఎక్కువగా సముద్రపు చేపలు తింటూ ఉంటారు. చేపల్లో విటమిన్స్ ఎక్కువగా ఉండడంతో పాటు ఇందులో ఎలాంటి కొవ్వు పెంచే పదార్థాలు ఉండవు.

Written By: Chai Muchhata, Updated On : January 13, 2024 6:15 pm

Koreans Slim Secret

Follow us on

Koreans Slim Secret: బక్కచిక్కిన నడుము.. చిన్న మోహం… చక్కటి స్మైల్.. పాల వలె తెల్లటి చర్మం ఉన్న కొరియన్లంతా ఒక్కతల్లి బిడ్డల్లా కనిపిస్తారు. ఒకసారి చూసిన వారిని మరోసారి చూస్తే అస్సలు గుర్తుపట్టరు. కొరియన్ సినిమాలు ఈ మధ్య భారతీయులు బాగా ఆదరిస్తున్నారు. దీంతో కొరియన్లను చూసి వీళ్లు ఇలా స్లిమ్ గా ఎలా ఉండగలుగుతున్నారు? అని చాలా మందికి సందేహం వస్తుంది. కొన్ని వీడియోల్లో వీరు ఎక్కువగా మాంసారం తింటూ కనిపిస్తారు. అయినా వీరు ఏమాత్రం బరువు లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు? అని ఆశ్చర్యపోతున్నారు. అయితే కొరియన్లు కొన్ని ప్రత్యేకమైన ఆహారపద్దతులను పాటిస్తారు. వీరి అలవాట్లు ఎలా ఉంటాయంటే?

మాంసాహారం, శాఖాహారం:
కొరియన్లు మాంసాహారం, శాఖాహారం అని తేడా లేకుండా అన్నింటినీ తింటారు. కానీ ఎక్కువగా సముద్రపు చేపలు తింటూ ఉంటారు. చేపల్లో విటమిన్స్ ఎక్కువగా ఉండడంతో పాటు ఇందులో ఎలాంటి కొవ్వు పెంచే పదార్థాలు ఉండవు. అందువల్ల వీరు బరువు పెరగడానికి ఎలాంటి అవకాశం ఉండదు. సముద్రపు చేపలతో పాటు మాంసాహారాన్ని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే మాంసాహారంతో పాటు ప్రతి రోజూ కూరగాయలు తప్పనిసరిగా వండుకుంటారు.

పులియబెట్టిన కూరగాయలు:
వీరు స్లిమ్ గా ఉండడానికి ప్రధాన కారణం పులియబెట్టిన కూరగాయలను తినడం. కొరియన్లు కూరగాయలు కర్రీ చేసుకునే ముందు పులియబెడుతారు. అంటే వీటిని వండే ముందు ఒక పాత్రలో కూరగాయలు వేసి అందులో ఉప్పు, పంచదార, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, కారం, మిరియాలు వంటివి కలుపుతారు. ఆ తరువాత వీటిని కూరవండుకుంటారు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ సాఫీగా ఉంటుందని అంటుంటారు. అంతేకాకుండా బరువు ఉన్నవారు కూడా ఇలా పులియబెట్టిన ఆహారం తింటే వేగంగా తగ్గుతారని కొందరు చెబుతున్నారు.

నో అవుట్ సైడ్ ఫుడ్:
కొరియన్లు చూడ్డానికి ఎంతో స్టైల్ గా కనిపిస్తారు. కానీ తిండి విషయంలో సాంప్రదాయ వంటలనే ఎక్కువగా ఇష్టపడుతారు. వీరు బయట దొరికే ఫుడ్ జోలికి ఎక్కువగా వెళ్లరు. ఇంట్లో స్వయంగా వండుకుని తినేందుకే ఇష్టపడుతారు. ఈ క్రమంలో వారు ఎలాంటి కలుషిత ఆహారం తినకుండా ఫిట్ గా ఉంటారు. అంతేకాకుండా ఎటువంటి వ్యాధులకు గురికాకుండా ఉంటారు. కొన్ని ప్రత్యేక పదార్థాలు సైతం వీరు ఇంట్లోనే చేసుకోవడం విశేషం.

నడక లేదా సైకిల్:
వీరు ఫిట్ గా ఉండడానికి మరో బలమైన కారణం నడక. తక్కువ దూరం వెళ్లాల్సి వస్తే నడిచి వెళ్తారు. లేదా సైకిల్ ఉపయోగిస్తారు. సాధ్యమైనంత వరకు వెహికల్స్ ను ఉపయోగించకుండా ఉంటారు. దీంతో వీరి జీవనశైలిలో శరీర శ్రమ ఎక్కువగా ఉండడంతో వారి శరీరాల్లో ఎలాంటి కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. అంతేకాకుండా సైకిల్ తొక్కడం వల్ల ఎలాంటి పొట్ట కనిపించదు. ఇక వీరు ఏ పని చేసినా ఒత్తిడి లేకుండా పూర్తి చేస్తారు. ఇతరుల గురించి ఆలోచించకుండా ఎవరి పనులు వారు చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు.