https://oktelugu.com/

Pandem Kodi: పందెంలో ఓడిన కోళ్లను ఏం చేస్తారో తెలుసా?

కోడిపందాలతో పాటు గుండాట, కోత ముక్క వంటి జూదాల కోసం సైతం ఏర్పాట్లు సాగుతున్నాయి. రేపటి నుంచి మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలు కొనసాగుతాయి.

Written By:
  • Dharma
  • , Updated On : January 13, 2024 / 06:43 PM IST

    Pandem Kodi

    Follow us on

    Pandem Kodi: గోదావరి జిల్లాలో కోడిపందాలుకు రంగం సిద్ధమైంది. సంక్రాంతి సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున కోడి పందాలు జరుగుతాయి. పేరుకే నిషేధం కానీ ప్రతి గ్రామంలో కోడిపందాల నిర్వహణ జరుగుతూనే ఉంటుంది. కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటాయి. కోడిపందాలు చూసేందుకు, పందాలు కాసేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. కోడి పందాల శిబిరాల వద్ద సకల సౌకర్యాలు ఉంటాయి. ఈ ఏడాది కూడా గోదావరి జిల్లాల్లో శిబిరాలు వెలిశాయి.

    కోడిపందాలతో పాటు గుండాట, కోత ముక్క వంటి జూదాల కోసం సైతం ఏర్పాట్లు సాగుతున్నాయి. రేపటి నుంచి మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలు కొనసాగుతాయి. ఎన్నికల ఏడాది కావడంతో గ్రామాలకు రాజకీయ వాతావరణం వచ్చింది. వాటి ప్రభావం పోటీపై ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే హైటెక్ హాంగులు, ఫ్లడ్ లైట్ల వెలుగులు, భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి వ్యాప్తంగా వందకు పైగా బరులు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కోడిపందాలు ప్రారంభమయ్యాయి. భారీగా నగదు మారుతోంది.

    అయితే గెలిచిన కోడి తో పాటు ఓడిన కోడికి కూడా ఇక్కడ గిరాకీ ఉంటుంది. భారీగా ధర పలుకుతోంది. సాధారణంగా పందెంకోడికి పౌష్టికాహారం అందించి సిద్ధం చేస్తారు. జీడిపప్పు, బాదం పిస్తా వంటివి ఆహారంగా అందిస్తారు. చెరువులు, కాలువల్లో ఈత కొట్టిస్తారు. వీలైనంతవరకు వ్యాయామ ప్రక్రియ సైతం వాటికి అలవాటు చేస్తారు. దీంతో పందెం కోళ్ళు బలియంగా ఉంటాయి. అందుకే ఓడిన కోళ్లు సైతం ఎక్కువ ధరకు అమ్ముడు అవుతాయి. ఒక్క కోడి వేలల్లో పలుకుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఓడిన కోళ్లను సైతం వేలం వేసి విక్రయిస్తారు. ఇలా వేలంలో కోళ్లను దక్కించుకోవడం గొప్పగా భావిస్తారు స్థానికులు.