https://oktelugu.com/

Priyanka Jain: ప్రియుడితో కలిసి అమెరికాకు జంప్… బిగ్ బాస్ ప్రియాంక షాకింగ్ డెసిషన్

ఫ్యామిలీ వీక్ లో శివ్ రావడం. ప్రియాంకతో రొమాన్స్ చేయడం ఇదంతా తెలిసిందే. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పియంక, శివ్ కలిసే కనిపిస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : January 13, 2024 / 06:05 PM IST

    Priyanka Jain

    Follow us on

    Priyanka Jain: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక. బిగ్ బాస్ ద్వారా మరింత ఫేమస్ అయింది. మౌనరాగం సీరియల్ లో శివ్ కుమార్ తో కలిసి నటించింది. ఆ సమయంలో అతనితో ప్రేమలో పడింది. గత కొన్నేళ్లుగా వాళ్ళు లివింగ్ రిలేషన్ షిప్ లో ఒకే ఇంట్లో ఉంటున్నారు. కానీ వారి ప్రేమ వ్యవహారం ఎక్కడా బయటపెట్టలేదు. ఇక బిగ్ బాస్ షోలో ఈ సీక్రెట్ రివీల్ చేసింది ప్రియాంక.

    ఫ్యామిలీ వీక్ లో శివ్ రావడం. ప్రియాంకతో రొమాన్స్ చేయడం ఇదంతా తెలిసిందే. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పియంక, శివ్ కలిసే కనిపిస్తున్నారు. ఇటీవల ప్రియాంక కంటి సర్జరీ అంటూ ఓ వీడియో చేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నెవెర్ ఎండింగ్ టేల్స్ లో పోస్ట్ చేశారు. ఏకంగా సర్జరీ కూడా టెలికాస్ట్ చేసేసాడు. అయితే ఇప్పుడు తాజాగా హైదరాబాద్ వదిలేసి .. అమెరికా కి షిఫ్ట్ అవుతున్నాం అంటూ వీడియో తీసి పెట్టారు ప్రియాంక.

    ఈ వీడియోలో ఎయిర్ పోర్ట్ లో కనిపించిన వీళ్ళు అమెరికా షిఫ్ట్ అవుతున్నాం అంటూ షాక్ ఇచ్చారు.అయితే వీసా కోసం అప్లై చేసుకోగా ఇంటర్వ్యూ కి రమ్మని ఓ కాల్ వచ్చిందట. ఇందుకోసం వీళ్ళిద్దరూ కలిసి ఢిల్లీ వెళ్లారు. వీసా కోసం ఇద్దరు ఢిల్లీ వెళ్లడం .. ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో స్టే చేయడం .. శివ్ కుమార్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం. ఆ విషయాన్ని ప్రియాంకకు చెప్పడం ఈ వీడియోలో చూపించారు.

    అయితే ఆ తర్వాత అసలు విషయం బయటపెట్టారు. అమెరికా వెళ్ళేది ప్రియాంక కాదని .. తాను మాత్రమే అని శివ్ కుమార్ చెప్పారు. అది కూడా కేవలం రెండు మూడు నెలల కోసమే అని వెల్లడించారు. కానీ మొత్తానికి అమెరికా షిఫ్ట్ అవుతున్నట్లు షాక్ ఇచ్చారు. వీడియో పూర్తిగా చూస్తే కానీ అసలు విషయం అర్ధం కాలేదు.