spot_img
Homeట్రెండింగ్ న్యూస్Pranav Shahana Love Story: ఇదికదా ప్రేమంటే.. ఫేస్‌బుక్‌ వీడియోలు చూసి ప్రేమించింది.. వైకల్యం ఉందని...

Pranav Shahana Love Story: ఇదికదా ప్రేమంటే.. ఫేస్‌బుక్‌ వీడియోలు చూసి ప్రేమించింది.. వైకల్యం ఉందని తెలిసి చివరకు అలా..!

Pranav Shahana Love Story: ఆ అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలనుకుంది . ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. అతన్నే చేసుకుంటానని పట్టుపట్టింది. చివరికి తల్లిదండ్రుల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఏముంది విశేషం . ఇవాళ రేపు ఇలాంటి పెళ్లిల్లు చాలనే జరుగుతున్నాయి కదా . కానీ ఈ పెళ్లికి ఒక విశేషం ఉంది. ఎందుకంటే వారిది మామూలు పెళ్లి కాదు మరి. ఆ అమ్మాయి ప్రేమలో ఒక నిజాయితి ఉంది. వారిపెళ్లి ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారి దేశంమొత్తం చేత శెభాష్‌ అనిపించుకుంటుంది. ప్రేమించిన వాడు, పెళ్లి చేసుకోబోయే వాడు దివ్యాంగుడని తెలీసి ముందడుగు వేయడం మామూలు విషయం కాదు.

కేరళకు చెందిన యువకుడు..
కేరళలోని త్రిసూర్‌కి 25కిలోమీటర్ల దూరంలో ఉన్న తాజేఘాట్‌ ప్రణవ్‌ది. చదువుకునే రోజుల్లో బైక్‌ యాక్సిడెంట్‌కి గురై, తుంటి కింద భాగం దెబ్బతిని నడవలేని పరిస్థితి వచ్చింది. పక్షవాతంతో చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. అన్నింటికీ ఇతరుల సాయంపై ఆధారపడాల్సి వస్తోంది. అయినప్పటికీ నిరుత్సాహపడని ప్రణవ్‌ అందరు యువకుల్లానే ఉండాలని అనుకునేవాడు. అందులో భాగంగా అక్కడి ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు వెళ్తుండేవాడు. పండుగల్ని కళ్లారా చూసేవాడు. ఫ్రెండ్స్‌తోపాటు తను కూడా డ్యాన్స్‌ చేస్తూ ఎంజాయ్‌ చేసేవాడు. ప్రణవ్‌ ఫ్రెండ్‌ అతని వీడియోలు తీసి , సోషల్‌ మీడియాలో పోస్టు చేసేవాడు. ప్రణవ్‌ తల్లి తన కొడుకుకి అన్నం తినిపిస్తున్న వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసేవాళ్లు. ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.

వీడియోస్‌ చూసి…
ప్రణవ్‌ వీడియోలు ఒకరోజు అనుకోకుండా షహానా అనే అమ్మాయి చూసింది. షహానాది తిరువనంతపురం. ఆ వీడియోస్‌లో ప్రణవ్‌ కాన్పిడెన్స్‌ షహానాకి ఎంతో నచ్చింది. తన వైకల్యానికి కుంగిపోకుండా అందరిలానే ఉండాలనే ప్రణవ్‌ తత్వం నచ్చింది. ఫ్లైట్‌ ఎక్కి నేరుగా అతని దగ్గరికి వెళ్లింది. తర్వాత సోషల్‌ మీడియాలో అతడితో ఇంటరాక్ట్‌ అయింది. కొన్ని నెలల తర్వాత ప్రణవ్‌ ఫోన్‌ నంబర్‌ తీసుకుంది. అతనిని ఫోన్‌చేసి మాట్లాడింది. అలా ఇద్దరూ పరిచయమయ్యారు. కొన్ని రోజుల తర్వాత ప్రణవ్‌కు తన ప్రేమ విషయాన్ని చెప్పిన షహానా, పెళ్లి చేసుకుందా అని అడిగింది.

నిరాకరించిన ప్రణవ్‌..
షహానా ప్రపోజల్‌కి ప్రణవ్‌ ఒప్పుకోలేదు. నా లాంటి వాణ్ని చేసుకొని నువ్వు సుఖంగా ఉండలేవు. ఇంకెవరినైనా చేసుకో హాయిగా ఉండు అన్నాడు. ప్రణవ్‌ మాటకి షహానా ఒప్పుకోలేదు. ‘పెళ్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా లేదంటే ఇలాగే ఉండిపోతా.. నేనంటే నీకు ఇష్టమా కాదా’ అని అడిగింది. దానికి సమాధానంగా నువ్వంటే ప్రాణం, కానీ ఏదో చెప్పబోయాడు. అంతే నీ సందేహం నాకు అర్దం అయింది. మా పేరెంట్స్‌ ని నేను ఒప్పిస్తా అంది.

పేరెంట్స్‌ కాదన్నా..
కానీ షహానా పేరెంట్స్‌ ప్రణవ్‌తో పెళ్లికి ఒప్పుకోలేదు. చూస్తూ చూస్తూ ఏ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకోదు అని మొదట కోప్పడ్డారు. తర్వాత వద్దు తల్లీ అని బతిమలాడారు. తల్లిదండ్రుల మాటకి షహానా ఒప్పుకోలేదు. నాకు లేని బాధ మీకెందుకు అని తల్లిదండ్రుల్ని ప్రశ్నించింది.పెళ్లంటూ చేస్కుంటే ప్రణవ్‌ నే చేస్కుంటానని తెగేసి చెప్పింది.

ప్రేమంటే భౌతిక రూపంతో పనిలేదనీ, మనసులు కలిసేదే నిజమైన ప్రేమ అని చాటిచెప్పింది. ఆమె అంతలా ఇష్టపడుతుండటంతో ఇక తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. అలా ఓ ఆలయంలో ఫిబ్రవరి 3న ఈ ప్రేమ జంట పెళ్లితో ఒక్కటైంది. ఈ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. షహానా నిజమైన ప్రేమను అందరూ అభినందిస్తున్నారు. న్యూ కపల్స్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper
Exit mobile version