Kerala local body polls : కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అసలు కేరళ ఎన్నికలు ఎందుకు ప్రత్యేకం. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ప్రతీ చోట కామనే. రూలింగ్ పార్టీ ఏది అధికారం ఉంటే వాళ్లకు ఎక్కువగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు, సీట్లు వస్తాయి. అది పెద్ద ప్రాధాన్యత అంశంగా చూడరు. కానీ కేరళలో అది కాదు. కేరళలో అత్యంత ప్రాధాన్యత అంశం.
కేరళలలో పార్టీల పరంగా పంచాయితీ ఎన్నికలు జరుగుతాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిదన్నది ఈ పంచాయితీ ఎన్నికలు డిసైడ్ చేస్తాయి. ముఖ్యంగా పినరయి విజయన్ ప్రభుత్వం మీద ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని ఈ ఫలితాలు చూపించాయి. ఆరుసిటీ కార్పొరేషన్లలో 5 చిత్తుగా అధికార పార్టీ ఓడిపోయింది. ఇంకో కోజికోడ్ లోనూ మెజార్టీ రాకుండా ఆగిపోయింది. 86 మున్సిపాలిట్లో 26 మున్సిపాలిటీల్లోనే ఆధిక్యంలో ఉంది. జిల్లా పంచాయితీల్లో 14 లో 7 గెలుచుకుంది. రూరల్ లో సత్తా చాటుకుంది. అన్ని ఎన్నికల్లో యూడీఎఫ్ సత్తా చాటుకుంది. సిటీ, అర్బన్ లలో ఎల్డీఎఫ్ పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయింది.
ఈ ఎన్నికల ఫలితం ఏంటని చూస్తే.. యూడీఎఫ్ స్వీప్ చేయబోతోంది. యూడీఎఫ్ మామూలుగా కాదు.. కార్పొరేషన్లలో మెజార్టీ గెలిచింది. కాంగ్రెస్, ముస్లిం ఎల్డీఎఫ్ వచ్చేసారి గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ముస్లిం లీగ్ రాష్ట్రమొత్తం వ్యాప్తి చెందింది.
కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు ప్రత్యేకం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
