Kedarnath Helicopter Accident: ఉత్తరాఖండ్‌లో మరో ఘోర ప్రమాదం జరిగింది. ప్రముఖ జ్యోతిర్లింగ్ క్షేత్రం కేదార్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. చనిపోయిన వాళ్లలో నలుగురు యాత్రికులు, ఇద్దరు పైలెట్లు ఉన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.

వాతావరణం అనుకూలించకనే..
కేదారీనాథ్‌లో హెలికాప్టర్ కూలిపోవడానికి వాతావరణ పరిస్థితులే కారణమని తెలుస్తోంది. చనిపోయిన వాళ్ల వివరాలు ఏంటీ అనే విషయాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంలో చనిపోయిన ఆరుగురు మృతదేహాలను అధికారులు రికవరీ చేసుకున్నట్లుగా అధికారులు తెలిపారు.
ఆలయాని అతి సమీపంలో..
కేదార్‌నాథ్ ధామ్‌లో హెలికాప్టర్ కూలిపోయిన ప్రమాదం ఉత్తరాఖండ్‌లో సంచలనం రేపుతోంది. ఆలయానికి అతి సమీపంలో ఉండే గరుడచట్టి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆర్యన్ హెలీ కంపెనీకి చెందినదని అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌లో ఆరుగురు ప్రయాణికులు కూర్చున్నారు. దట్టమైన పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా అధికారులు తెలిపారు. ప్రమాదంలో ముక్కలైన హెలికాప్టర్ శకలాలతో ఘటన స్థలంలో భీతావాహ వాతావరణం నెలకొంది. కేదార్‌నాథ్ ధామ్‌లో పొగమంచు కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

2018లో కూడా…
2018లో, ఏప్రిల్ 3న కూడా కేదార్‌నాథ్ ఆలయం సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. హెలీపాడ్ సమీపంలోని ఓ ఇనుప కడ్డీని వాయుసేనకు చెందిన హెలికాప్టర్ ఢీకొట్టడంతో అది తలకిందులుగా కుప్పకూలింది. సైనిక పరికరాలతో పాటు ఎనిమిది మంది ప్రయాణిస్తున్న రష్యా నుంచి కొనుగోలుచేసి ఎమ్‌ఐ – 17 కార్గో హెలికాప్టర్ కేదార్‌నాథ్ ఆలయ సమీపంలోని హెలీపాడ్ వద్ద దిగడానికి ప్రయత్నించింది. ఈ సమయంలో అక్కడే ఉన్న ఓ ఇనుప కడ్డీ బలంగా తగలడతో అది తలకిందులుగా కూలి లోపలి నుంచి మంటలు వచ్చాయి.
నలుగురికి గాయాలు..
ఈ ప్రమాదంలో పైలట్‌తో సహా నలుగురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరక్కపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.