Pawan Kalyan Fire On YCP: ఎప్పుడూ సహనంతో, సంయమనంతో వ్యవహరించే పవన్ కళ్యాణ్ తొలిసారిగా బరెస్ట్ అయ్యారు. ఇటీవల వైసీపీ ఆగడాలు పెచ్చుమీరుతుండడం, విశాఖ ఘటనలు, జనసేన జనవాణిని అడ్డుకోవడం, తన పర్యటనపై ఆంక్షలు విధించడం, జనసేన నాయకులు, వీర మహిళల అక్రమ అరెస్ట్ లపై పవన్ రియాక్టయ్యారు. మంగళగిరిలో పార్టీ శ్రేణుల సమావేశంలో ఓకింత ఆగ్రహంగా మాట్లాడారు. వైసీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని ప్రశ్నించిన ప్రతీసారి వైసీపీ నేతలు పవన్ వ్యక్తిగత జీవితాన్నే ప్రస్తావిస్తూ వచ్చారు. అలాగే ప్యాకేజీ నాయకుడంటూ ఎద్దేవా చేస్తుంటారు. మరోవైపు కాపు సామాజికవర్గానికి చెందిన వైసీపీ ప్రజాప్రతినిధులు తిట్ల దండకానికి దిగుతుంటారు. వీటిన్నింటిపైనా పవన్ తనదైన శైలిలో ప్రసంగించాడు.

ముఖ్యంగా తన వైవాహిక జీవితం గురించి భావోద్వేగంతో మాట్లాడారు. వైసీపీ నేతలు తన వ్యక్తిగత జీవితంపై పదేపదే మాట్లాడుతుండంపై తొలిసారిగా స్పందించారు. తాను అధికారికంగా విడాకులు తీసుకొని పెళ్లిళ్లు చేసుకున్నానని.. నా కొడకల్లారా గుర్తు పెట్టుకొని మాట్లాడండి అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అధికారికంగా, రాజ్యాంగ బద్ధంగా, ఇష్టపూర్వక అంగీకారాలతోనే విడాకులు, వివాహాలు చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. తనపై పదే పదే వ్యక్తిగత కామెంట్స్ చేస్తున్న వారికి దీటైన కౌంటర్ ఇచ్చారు. ఇక నుంచి తనపై విమర్శలు చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.
అటు ప్యాకేజీ నాయకుడు అంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై కూడా స్పందించారు. తనకు ప్యాకేజీ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. గత ఎనిమిదేళ్లలో ఆరు చిత్రాలు నటించానని… సుమారు రూ.120 కోట్లు సంపాదించానని చెప్పారు. ప్రభుత్వాలకు పన్నులు, జీఎస్టీ సక్రమంగా కట్టానని చెప్పారు. తన బిడ్డల కోసం ఉంచిన ఫిక్సిడ్ డిపాజిట్లు తీసి ఆఫీసు కట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటివరకూ రూ.33 కోట్ల వరకూ పన్నుల రూపంలో చెల్లించానని.. విపత్తుల సహాయ నిధి కింద ఉభయ తెలుగు రాష్ట్రాలకు రూ.12 కోట్లు వరకూ అందించానన్నారు. ప్యాకేజీ నాకు అవసరమా అని ప్రశ్నించారు. డబ్బే కావాలంటే తాను సంపాదించుకోలేనా అని కూడా అన్నారు. ప్యాకేజీ స్టార్ అంటే పిసికి చంపేస్తా నా కొడకల్లారా? అంటూ సవాల్ చేశారు.

తనను తిట్టడానికి కాపు అనే పదం ఉపయోగించుకుంటున్న వైసీపీ ప్రజాప్రతినిధులకు నేరుగా సవాల్ చేశారు. నన్ను తిట్టి మళ్లీ నన్నే సోదరా అని సంబంధిస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారం కోసం కేరెక్టర్ ను చంపుకుంటారా అని ప్రశ్నించారు. మీది ఒక బతుకేనా అని కూడా నిలదీశారు. తనపై వ్యక్తిగత విమర్శలకు వైసీపీ నాయకత్వం మిమ్మల్ని వాడుకుంటుందన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. తనకు కులాభిమానం లేదని.. ప్రాంతీయ తత్వం అంతకంటే లేదన్నారు. కులం పేరుతో తనను దూషిస్తే మాత్రం నా కొడకల్లారా చీల్చిచెమడాలు తీస్తానని హెచ్చరించారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా.. వైసీపీ దురాగతాలను వారి స్టైల్ లోనే పవన్ కళ్యాణ్ తిప్పి కొట్టారు.