Homeఅంతర్జాతీయంDonald Trump Tariffs: ట్రంప్‌కు మరోషాక్‌.. ఆవి రిఫండ్‌ చేయాల్సిందే!

Donald Trump Tariffs: ట్రంప్‌కు మరోషాక్‌.. ఆవి రిఫండ్‌ చేయాల్సిందే!

Donald Trump Tariffs: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ తన ఏడాది పాలనలో తమ దేశానికి సరుకులు ఎగుమతి చేసే దేశాలపై టారిఫ్‌లు విధించడడానికే ఎక్కువగా సమయం కేటాయించారు. అమెరికా ఆదాయం పెంపునకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో దిగుమతులపై 5 నుంచి 150 శాతం వరకు టారిఫ్‌లు విధించారు. అయితే ఈ టారిఫ్‌లు రాజ్యాంగ విరుద్ధమని అమెరికా సుప్రీం కోర్టు ప్రకటించి షాక్‌ ఇచ్చింది. టారిఫ్‌లకు విరుద్ధంగా కేసు వేసింది ఓ బొమ్మల వ్యాపారి. ఇక ఈ కేసును వాదించింది భారత సంతతికి చెందిన లాయర్‌. ఈ షాక్‌ నుంచి తేరుకోకముందే ట్రంప్‌కు అమెరికా ట్రేడ్‌ కోర్టు మరో షాక్‌ ఇచ్చింది. వివిధ దేశాల నుంచి వసూలు చేసిన అధిక టారిఫ్‌లు రిఫండ్‌ చేయాలని ఆదేశించింది. ఇది ట్రంప్‌ ఉపయోగించిన జాతీయ భద్రతా పవర్, సెక్షన్‌ 301 (వాణిజ్య అన్యాయాలకు ప్రతీకారం) కింది టారిఫ్‌లపై వర్తిస్తుంది. సుమారు 20 వేలకుపైగా కంపెనీలు ఈ రాయితీకి అర్హులవుతాయని కోర్టు స్పష్టం చేసింది.

Also Read: భారత్ వరకూ వచ్చిన యుద్ధం.. అమెరికా తెగించేసింది..

టారిఫ్‌లు ఎందుకు వచ్చాయి?
ట్రంప్‌ పాలిసీల్లో ఉక్కు, అల్యూమినియం, చైనా ఉత్పత్తులపై 10–25% లేవీలు అమలు చేశారు. ఇవి దేశీయ పరిశ్రమలను కాపాడటానికి, వాణిజ్య లోపాలను సరిచేయడానికి ఉద్దేశించాయి. మొత్తం వసూళ్లు 175 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అయితే, సుప్రీం కోర్టు ముందుగా ఈ టారిఫ్‌లను రద్దు చేసింది. ఇది ఎమర్జెన్సీ పవర్‌ల దుర్వినియోగాన్ని ప్రశ్నించింది. తాజాగా ట్రేడ్‌ కోర్టు రిఫండ్‌కు ఆదేశించింది.

ఆర్థిక, రాజకీయ ప్రభావాలు
కంపెనీలకు రిఫండ్‌తో ధరలు తగ్గి, వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. కానీ, ప్రభుత్వ ఖర్చులు పెరిగి ఆర్థిక లోపం మరింత పెరుగుతుంది. చైనా, ఈయూలతో వాణిజ్య యుద్ధాలు తగ్గే అవకాశం ఉంది. రాజకీయంగా, ట్రంప్‌కు 2026 ఎన్నికల్లో ఇది పోటీదారుల ఆయుధంగా మారవచ్చు.

ఈ నిర్ణయం అధ్యక్షుల అధికారాలను పరిమితం చేస్తూ, కాంగ్రెస్‌ అనుమతి లేకుండా టారిఫ్‌లు విధించడానికి అడ్డుకట్ట వేస్తుంది. చారిత్రకంగా, ఇది 1930ల స్మూట్‌–హావ్లీ టారిఫ్‌ చట్టం తర్వాత మొదటి పెద్ద దెబ్బ. భవిష్యత్తులో డబ్ల్యూటీవో వంటి అంతర్జాతీయ ఒప్పందాలు బలపడతాయి. కోర్ట తీర్పుపై ట్రంప్‌ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper
Exit mobile version