Kavitha Letter To KCR: భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ రాసిన లేఖ వ్యవహారం సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో.. ఇది పార్టీలో ముసలం పుట్టడానికి కారణం అవుతుందనే చర్చ జరుగుతున్నది. కొంతకాలంగా పార్టీలో తనపై కుట్ర జరుగుతోందని కవిత పలు సందర్భాల్లో తన అంతరంగీకుల వద్ద వ్యాఖ్యానించారు. అదే విషయాన్ని లేఖలో కూడా ప్రస్తావించారు. అంతేకాదు ఇప్పుడు కెసిఆర్ సొంత మీడియాలోనూ కవితకు ఒక పట్లగా ప్రచారం లభించడం లేదు. స్పేస్ దక్కడం లేదు. దీంతో ఆమె ఓన్ గానే జిల్లాలలో పర్యటిస్తున్నారు. కాదు బెయిల్ పై విడుదలైన తర్వాత భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీని తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశాలు నిర్వహించవద్దని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే కవిత రాసిన లేఖలను కొందరు కావాలనే బయట పెట్టడంతో పార్టీలో జరుగుతున్న వ్యవహారం ఒక్కసారిగా బయటికి వచ్చింది. ఈ లేఖలు నకిలీవని.. ఎవరో కావాలని చేసినవనే దిశగా ప్రజలకు తీసుకెళ్లాలని భారత రాష్ట్ర సమితి నేతలు భావించినప్పటికీ.. కవిత ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడంతో.. లేఖల విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో.. హై కమాండ్ బ్యాక్ స్టెప్ వేసింది.
ఇక ఇటీవల ఓ కుటుంబం కేసీఆర్ ను కలవడానికి ప్రయత్నాలు చేసింది. అయితే వారికి ఆ అవకాశాన్ని ఇవ్వకుండా పార్టీలో ఓ కోటరి అడ్డుకుంది. ఇది కవితకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ విషయంలో ఆమె గొడవ కూడా పడ్డట్టు తెలుస్తోంది. అందువల్లే ఆమె తన కోపాన్ని ఈ లేఖ ద్వారా బయట పెట్టాలని సమాచారం. ఆ కోటరి వల్ల తనకు, తన తండ్రికి మధ్య దూరం పెరిగిందనే భావన ఆమెలో పెరిగిందని తెలుస్తోంది. మరోవైపు పార్టీలో కవిత దూకుడు ఇటీవల కాలంలో ఎక్కువ కావడంతో.. దాన్ని తగ్గించడానికి ఈ లేఖ వ్యవహారాన్ని బయటపెట్టారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో కారు పార్టీలో ఏదైనా సంక్షోభం ఏర్పడినప్పుడు ప్రతిపక్షాల పని అని, తెలంగాణ ద్రోహులు కుట్రలు చేస్తున్నారని, ఢిల్లీ వాళ్ళు చక్రం తిప్పుతున్నారని విమర్శలు చేసి.. ఆ సంక్షోభం నుంచి కారు పార్టీ బయటపడేది. కానీ ఇప్పుడు సొంత కూతురు లెటర్ రాయడంతో ఏం చేయలేని పరిస్థితి కెసిఆర్ ది. 2007లో ఆలే నరేంద్ర తో ఏర్పడిన విభేదాల వల్ల ఆయనను కేసీఆర్ బయటికి పంపించారు. అయితే నాడు కెసిఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏ తెలంగాణ వాది కూడా వ్యతిరేకించలేకపోయారు. తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేసుకొని.. తనతో పాటు ఎంపీగా గెలిచిన విజయశాంతిని నేరుగా ఆమె పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితిని కేసీఆర్ కల్పించారు. ఇక పార్టీలో సీనియర్ నాయకుడు ఈటెల రాజేందర్ కూ ఇదే అనుభవం ఎదురయింది.
కెసిఆర్ ను ప్రశ్నిస్తే తట్టుకోలేరు. ఆయన తప్పులను ఎత్తి చూపిస్తే సహించలేరు. అందువల్లే గతంలో పార్టీలో పని చేసిన వారంతా బయటకు వెళ్లిపోయారు. ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తయితే, కారు పార్టీలో సొంత ఇంటి నుంచే కూతురు రూపంలో ధిక్కారం ఎదురవుతోంది. మరి ఈ అంశాన్ని కేసీఆర్ ఎలా డీల్ చేస్తారో? చూడాల్సి ఉందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. మొత్తానికి కవిత లెటర్ ఎపిసోడ్ మాత్రం పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని గులాబీ నేతలు అంటున్నారు. ఇక ఈ వ్యవహారాన్ని సావధానంగా పరిష్కరించుకోలేకపోతే నష్టం తీవ్రంగా ఉంటుందని వారు ఆపోతున్నారు..” కెసిఆర్ కు, పిల్లలకు మధ్య అనుసంధానకర్తగా కేసీఆర్ సతీమణి శోభ వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం కూతురు విషయంలోనూ ఆమె చొరవ తీసుకునే అవకాశాలున్నాయి. ఆమెకనుక రంగంలోకి దిగితే పరిస్థితి చక్కబడచ్చని” పార్టీ వర్గాలు అంటున్నాయి.