Chiranjeevi – Anil Ravipudi movie shooting : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘విశ్వంభర'(Vishwambhara Movie) చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో చెప్పలేము కానీ, ఆయన తదుపరి చిత్రం మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతుంది అనేది మాత్రం ఖరారు అయిపోయింది. రీసెంట్ గానే పూజా కార్యక్రమాలను కూడా మొదలు పెట్టుకున్న ఈ సినిమా, నిన్నటి నుండి రెగ్యులర్ షూటింగ్ ని కూడా మొదలు పెట్టుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం లో హీరోయిన్ గా నయనతార(Nayanathara) నటించబోతుంది. ప్రొమోషన్స్ కి ఎల్లప్పుడూ దూరం గా ఉంటూ వచ్చిన నయనతార, ఈ సినిమా ప్రొమోషన్స్ లో మాత్రం యాక్టీవ్ గా ఉండబోతుంది. అందుకు సంకేతంగా ఆమె ఎంట్రీ నే ఒక స్పెషల్ వీడియో తో ప్రకటించారు. నయనతార లోని ఈ కొత్త యాంగిల్ ని చూసి ఆమె అభిమానులు కూడా షాక్ కి గురయ్యారు.
Also Read : రేపే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ప్రారంభోత్సవం..ముఖ్య అతిథి ఎవరంటే!
ఇకపోతే మొదటి రోజు షూటింగ్ లో భారీ ఫన్ ఎపిసోడ్ ని ప్లాన్ చేశారట. సినిమాలోని ప్రధాన తారాగణం మొత్తం నిన్న షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. కేవలం మూడు నెలల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చెయ్యాలనే పక్కా ప్రణాళిక వేసుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. కేవలం చిరంజీవి తో చేస్తున్న సినిమా మాత్రమే కాదు, ఏ సినిమాని అయినా అనిల్ రావిపూడి మూడు నెలల్లోనే పూర్తి చేస్తాడు. అది అతని స్టైల్. ఈ ఏడాది ‘సంక్రాంతి వస్తున్నాం’ చిత్రం తో భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందుకొని దాదాపుగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీంతో అనిల్ రావిపూడి పై అంతకు ముందుకంటే ఇప్పుడు అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పైగా చిరంజీవి తో సినిమా అంటే ఇక ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందుకే ఈ చిత్రం లో అనిల్ రావిపూడి మార్క్ కామెడీ తో పాటు వింటేజ్ మెగాస్టార్ హీరోయిజాన్ని కూడా చూపించబోతున్నట్టు తెలుస్తుంది.
ఒక్క మాట లో చెప్పాలంటే ఈ చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ స్టైల్ లో ఉండబోతుంది అన్నమాట. మరో సర్ప్రైజ్ అంశం ఏమిటంటే ఈ చిత్రం లో విక్టరీ వెంకటేష్ కూడా భాగం కావడమే. సెకండ్ హాఫ్ లో ఆయన ఎంట్రీ ఉంటుంది. వెంకటేష్ కోసం ప్రత్యేకంగా ఒక పాట, ఒక ఫైట్ సన్నివేశాన్ని కూడా డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ అంశాన్ని సైలెంట్ గానే ఉంచారు మేకర్స్. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అయితే వెంకటేష్ క్యారక్టర్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం లోని వైడీ రాజు పాత్రకు కొనసాగింపుగా ఉంటుందా?, లేకపోతే మామూలుగానే ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి ఆ రేంజ్ హైప్ విడుదలకు ముందు రావడానికి ప్రధాన కారణం భీమ్స్ అందించిన మ్యూజిక్ వల్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు, మెగాస్టార్ కి ఆ రేంజ్ మ్యూజిక్ ఇస్తాడో లేదో చూడాలి.
#Mega157 shoot begins ❤️#ChiruAnil SANKRANTHI 2026 – రఫ్ఫాడించేద్దాం pic.twitter.com/eNMNDyJszW
— Haashtag Media (@HaashtagMedia) May 23, 2025