Shocking News: పాములంటే అతడికి సరదా. వాటితో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటాడు. కానీ అవే అతడి పాలిట యమపాశంగా మారతాయని మాత్రం గ్రహించలేదు. మనకు ఎక్కడైనా పాము కనబడితే పారిపోతాం. మళ్లీ అటు వైపు వెళ్లడానికి జంకుతుంటాం. కానీ పాములు పట్టేవారు అలాకాదు. వాటిని పట్టుకుని ఆడిస్తుంటారు. అవి కూడా పాములు పట్టే వారితో సరదాగానే ఉన్నట్లుగా అనిపిస్తాయి. వాటి మనుగడకు ప్రమాదం అని భావిస్తే మాత్రం కచ్చితంగా కాటు వేస్తాయి. అందుకే అంటారు పాముకు పాలుపోసినట్లు అని. అంటే దానికి విశ్వాసం ఉండదు. కేవలం తన ఉనికిని కాపాడుకోవడమే దానికి తెలుసు.

ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన మాజ్ సయ్యద్ కు పాములు పట్టడం అంటే మహా సరదా. అవి ఎక్కడ కనిపించినా వాటిని పట్టుకుని ఆడిస్తుంటాడు. అతడికి స్నేక్ క్యాచర్ అనే పేరుంది. రకరకాల పాములను పడుతుంటాడు. వాటిని మళ్లీ అడవిలో వదిలేస్తుంటాడు. ఈ నేపథ్యంలో అతడు ఓసారి అడవిలో మూడు పాములను బుర్ర ఊదుతూ ఆడిస్తున్నాడు. అవి కూడా అతడి స్వరానికి తగ్గట్లుగా నాట్యం చేస్తున్నాయి. ఇంతలో ఓ పాము అతడి మీద దూకి కాటు వేసింది. తన కోరలతో అతడి ప్యాంటు పట్టుకుంది. విదిలించినా విడిచిపెట్టలేదు.
దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పాములతో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏ మాత్రం కుదురుగా లేకున్నా అవి దాడి చేసి కాటు వేస్తాయి. దీంతో ప్రాణాల మీదకే తెచ్చుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే విషపూరితమైన సర్పాలతో ఎందుకు సయ్యాటలు అనే వాదనలు కూడా ఆ వీడియో వెంట జత చేశారు. పాములతో సఖ్యత కుదరదు. వాటిని దూరంగా ఉంచాల్సిందే. ఇలా రకరకాల కామెంట్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి.

ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత నందా పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. దాని వెంట కామెంట్లు వస్తున్నాయి. ప్రస్తుతం సయ్యద్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆదమరిస్తే అంతే సంగతి. విష పూరిత జంతువులతో జాగ్రత్తగా ఉంటేనే మనకు రక్షణ. అంతేగానీ వాటితో ఆడుకుంటే ఇలాగే ఉంటుందని పలువురు కామెంట్లు పెడుతున్నారు. పాములను దూరంగానే ఉంచాలి. మనం కూడా వాటికి దూరంగానే ఉండాలి అనే విషయం తెలుసుకుంటే మంచిది.
Also Read: Akhilesh Yadav: అఖిలేష్ ఎన్నికల ఖర్చులను కేసీఆర్, జగన్ సర్జారట