https://oktelugu.com/

Bheemla Nayak OTT Release: భీమ్లానాయక్ ఓటీటీలో వచ్చే డేట్ ఇదే.. కన్ఫర్మ్ చేసిన మేకర్స్..

Bheemla Nayak OTT Release: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా వస్తుందంటేనే రికార్డులు బద్దలు అవుతుంటాయి. బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. ఇక ఎన్నో అంచనాల మధ్య మొన్న వచ్చిన భీమ్లానాయక్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. మలయాళంలో హిట్టయిన అయ్యప్పనుమ్ కోశియం మూవీకి రీమేక్ కావడం, పవన్ కోసం కొన్ని మార్పులు […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 18, 2022 / 12:28 PM IST

    Bheemla Nayak

    Follow us on

    Bheemla Nayak OTT Release: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా వస్తుందంటేనే రికార్డులు బద్దలు అవుతుంటాయి. బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. ఇక ఎన్నో అంచనాల మధ్య మొన్న వచ్చిన భీమ్లానాయక్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది.

    Bheemla Nayak

    మలయాళంలో హిట్టయిన అయ్యప్పనుమ్ కోశియం మూవీకి రీమేక్ కావడం, పవన్ కోసం కొన్ని మార్పులు చేయడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. గత నెల ఫిబ్రవరి 25న రిలీజ్ అయిన ఈ మూవీ వారం రోజుల పాటు బాక్సాఫీసును షేక్ చేసింది. దాదాపు వంద కోట్ల వరకు వసూలు చేసింది. కరోనా ప్రభావం తర్వాత వచ్చిన అతి పెద్ద భారీ సినిమా కూడా ఇదే కావడం విశేషం.

    Also Read: చంద్రబాబుపై బాంబు పేల్చిన మమతా బెనర్జీ.. అంత దారుణానికి బాబు దిగజారాడా?

    యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ.. నటీనటులకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. అయితే ఈ మధ్య ఎంత పెద్ద సినిమాలే అయినా కూడా చాలా త్వరగానే ఓటీటీ బాట పడుతున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న పాన్ ఇండియా మూవీ గా వచ్చిన రాధే శ్యామ్ త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక భీమ్ల నాయక్ కూడా త్వరలోనే ఓటీటీ బాట పడుతుందని చాలామంది అంటున్నారు.

    Pawan Kalyan and Rana

    కాగా దీనిపై ఇప్పుడు మూవీమేకర్స్ క్లారిటీ ఇచ్చారు. మూవీ రిలీజ్ అయిన సరిగ్గా నెల రోజులకు.. అంటే మార్చి 25న ఆహాతో పాటు డిస్నీ హాట్ స్టార్ లో కూడా విడుదల కాబోతోంది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరి థియేటర్లలో దుమ్ములేపే కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ.. ఓటీటీలో ఏ మేరకు వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

    Also Read: Akhilesh Yadav: అఖిలేష్ ఎన్నికల ఖర్చులను కేసీఆర్, జగన్ సర్జారట

    Tags