భారత్ లో మార్చి నెల తొలి వారం నుంచి కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నెలలు గడుస్తున్నా కేసుల సంఖ్య తగ్గుతుందే తప్ప పూర్తిస్థాయిలో కరోనా కట్టడి మాత్రం సాధ్యం కాలేదు. ఒక్కో వ్యక్తిపై ఒక్కో విధంగా వైరస్ ప్రభావం చూపుతుండటం గమనార్హం. శాస్త్రవేత్తలు కరోనా కేసుల గురించి, కరోనా మరణాల గురించి పరిశోధనలు చేస్తుండగా ఈ పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Also Read: సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్న కరోనా వ్యాక్సిన్.. వారికి ప్రమాదమే…?
శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారి గురించి చేసిన ఒక అధ్యయనంలో పెళ్లి కాని వారితో పోలిస్తే పెళ్లైన వారికి కరోనా ప్రభావం తక్కువని తేలింది. పెళ్లి కాని వారే ఎక్కువగా కరోనా బారిన పడుతుండగా వీళ్లే ఎక్కువగా కరోనా వల్ల చనిపోయే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెళ్లైన వారితో పోల్చి చూస్తే పెళ్లి కాని వారిలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. అందువల్ల పెళ్లి కాని వారు త్వరగా వైరస్ బారిన పడే అవకాశాలు ఉంటాయి.
Also Read: ఏపీ ప్రజలకు షాకింగ్ న్యూస్.. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్..?
స్వీడన్ స్టాక్హోమ్ యూనివర్సిటీ పరిశోధకులు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. పెళ్లి కాని వాళ్లలో సైతం సరైన ఆహారపు అలవాట్లు లేని వాళ్లు, తక్కువ ఆదాయం కలిగి ఉన్నవారు కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అయితే వివిధ దేశాలను బట్టి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించడంతో మన దేశంలోని వారిపై ఈ సర్వే ప్రభావం ఉంటుందో లేదో కచ్చితంగా చెప్పలేం.
మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం
మరోవైపు మన దేశంలోని ప్రజలకు వచ్చే ఏడాది తొలి వారం నుంచి వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. ఎంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే అంత త్వరగా వైరస్ ను కట్టడి చేసే అవకాశం ఉంటుంది.