
Kalpika Ganesh: అప్పట్లో రావూరి భరద్వాజ పాకుడు రాళ్ళు పేరుతో ఓ నవల రాశారు. అందులో సినీ అవకాశాల కోసం నటీమణులు ఎంత నరకం అనుభవిస్తారో… వాటికి సజీవ అక్షర రూపం ఇచ్చారు. వాస్తవానికి కథ కూడా ఒక కథ నాయక జీవితాన్ని ఆధారంగా తీసుకొని రాసినట్టు సమాచారం.. ఈ నవల జాతీయ పురస్కారం కూడా గెలుచుకున్నది. సినిమా పరిశ్రమలో ” # మీ టూ” ఉద్యమం మొదలవడానికి ఈ నవల కూడా ఒక కారణం.. ఇక తెలుగు పరిశ్రమలో కమిట్మెంట్ అనేది సర్వసాధారణమైపోయింది. పక్కలోకి వస్తేనే ఆవకాశాలు ఇస్తున్న తీరు విస్తు గొలుపుతోంది. నిర్మాతలు, దర్శకులు, హీరోలు, చివరకు పీఆర్వోలు కూడా ఆ తాను లో ముక్కలే. పైకి ఎన్నో నీతులు చెబుతారు కానీ.. లోపల మాత్రం అదే చెండాలం, అదే నికృష్టం.
కమిట్ అవ్వాల్సిందే
రణరంగం కాని చోటు ఈ భూమండలంలో ఎక్కడ దొరకదు అంటాడు శ్రీ శ్రీ . అలాగే కమిట్ మెంట్ కు గురి కాకుండా, ఆ పదం వినకుండా ఏ హీరోయిన్ ఉండదు. ఒకవేళ ఉన్నా ఆమె పరిశ్రమలో మనుగడ సాగించలేదు. ఓ పేరు పొందిన నిర్మాత ఓ సినిమా తీస్తున్నాడు. ఆయన వయస్సు అప్పటికీ 60 దాటాయి. హీరోయిన్ గా ఎంపిక చేసిన అమ్మాయి ని పక్కలోకి రమ్మన్నాడు. ఆమె కుదరదు అన్నది. ఇది మనసు లో పెట్టుకున్న ఆ నిర్మాత ఆమెకి అవకాశాలు రాకుండా చేశాడు. ఏ ఉడ్ లలోనూ అవకాశాలు దక్కకుండా చేశాడు. గత్యంతరం లేక ఆమె కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో హీరోయిన్ ది ఒక్కో బాధ.
ఏం చేయగలిగారు?
ఆ మధ్య బాలీవుడ్ లో “మీ టూ” అనే ఒక ఉద్యమం మొదలయింది. అవకాశాల కోసం తాము ఎలా లైంగిక వేధింపులకు గురయ్యామో కథానాయికలు వివిధ సందర్భాల్లో చెప్పారు. ప్రముఖ గాయని చిన్మయి ఓ పాటల రచయిత వైర ముత్తు తనను ఎలా వేధించాడో మీడియా ముందుకు వచ్చి చెప్పింది. అప్పట్లో కోలీవుడ్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. తర్వాత ఏముంది షరా మామూలే.. పక్కలోకి వస్తేనే అవకాశాలు ఇస్తామనే విధానం మళ్లీ షురూ అయింది. ఈ దారుణంలో చాలా మంది బాధితులే. కానీ కొందరే బయటకి వస్తున్నారు. అలా వచ్చిన వాళ్ళకి అవకాశాలు లేకుండా చేస్తున్నారు.

కల్పిక గణేష్ కు చేదు అనుభవం
జులాయి, యశోద వంటి సినిమాల్లో మెరిసిన కల్పిక గణేష్…తన కెరియర్ తొలి నాళ్లల్లో ఓ సినిమా అడిషన్ కు వెళ్ళింది. వెంట తన తల్లిని తీసుకుని వెళ్ళింది. స్క్రీన్ టెస్ట్ చేశాక డైరెక్టర్ ఓకే చెప్పాడు. కానీ చివరిలో డైరెక్టర్ అసిస్టెంట్ కల్పికను కమిట్మెంట్ అడిగాడు. దానికి అగ్గి మీద గుగ్గిలం అయిన కల్పిక.. అక్కడి నుంచి వెంటనే జారుకుంది. ఇవి వెలుగులోకి వచ్చినవే. రానివి ఎన్నో. డెరైక్టర్లు,నిర్మాతలు,హీరోల పైత్యం మారనంత వరకు కమిట్మెంట్ కొనసాగుతూనే ఉంటుంది. ఎన్ని మీ టూ ఉద్యమాలు వచ్చినా రెండు రోజులు బ్రేకింగ్ న్యూస్ లు అవుతాయి. తర్వాత షరా మామూలే.
View this post on Instagram