
Gomathi Reddy : ప్రతిభ ఉంటే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ అక్కర్లేదు, సామాన్యులు కూడా ఉన్నత స్థానాలను అధిరోహించగలరు అని ఇదివరకే చాలా సందర్భాలలో నిరూపితమైంది.. ఇప్పుడు అలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని ముక్కావారిపల్లె కు చెందిన రైతు శ్రీనివాసుల రెడ్డి మరియు అరుణ దంపుతుల కుమార్తె గోమతిరెడ్డి ఈ ఏడాది మార్చి 5 వ తారీఖున ముంబైలో జరగబోతున్న మిస్ ఇండియా పోటీలకు ఎంపిక అయ్యింది.
ఇప్పటికే ఈమె మిస్ ఆంధ్ర పోటీలలో పాల్గొని టైటిల్ ని కూడా గెలుచుకుందట.ఒకపక్క జీవినాధారం కోసం సాఫ్ట్ వేర్ డెవలపర్ గా పని చేస్తూనే మరో పక్క తన కల అయినా మిస్ ఇండియా పోటీలలో పాల్గొనే రేంజ్ కి ఆమె ఎదగడం నిజంగా ప్రశంసనీయం.ఆమె గెలుస్తుందో లేదో అనేది పక్కన పెడితే ఒక మధ్య తరగతి కుటుంబం నుండి నేషనల్ లెవెల్ లో జరిగే పోటీలలో పాల్గొనే స్థాయికి ఎదగడం పెద్ద అఛీవ్మెంట్ అనే చెప్పాలి.

మరో విశేషం ఏమిటంటే ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక అమ్మాయి మిస్ ఇండియా పోటీలలో పాల్గొన్నట్టు రికార్డ్స్ లో లేవు.ఇప్పటి వరకు నార్త్ ఇండియా కి సంబంధించిన వాళ్ళే ఈ పోటీలలో పాల్గొంటూ గెలుస్తూ వచ్చారు.అలాంటిది ఒక మారుమూల గ్రామానికి చెందిన మన తెలుగు రైతు బిడ్డ నేడు మిస్ ఇండియా పోటీలలో పాల్గొనబోతుండడం నిజంగా మనకి ఎంతో గర్వకారణం.
ఈ పోటీలలో ఆమె టాప్ 3 లోకి వస్తే ఆమె జీవితమే మారిపోతుంది అనుకోవచ్చు.మోడలింగ్ రంగం లో శిఖరాగ్ర స్థాయికి వెళ్లే అవకాశం మాత్రమే కాకుండా, సినిమాల్లో కూడా ఫుల్లుగా అవకాశాలు దక్కించుకోవచ్చు.మరి ఆమె జాతకం ఎలా రాసుందో చూడాలి.ఈ మిస్ ఇండియా పోటీలలో ఆమె గెలుపొంది మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.