చందమామ కాజల్ టాలీవుడ్లో దశాబ్దంన్నరకు పైగా సినిమాల్లో నటిస్తోంది. టాలీవుడ్లో అగ్ర కథనాయికగా కొనసాగుతూనే తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోని పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం కాజల్ మెగాస్టార్ చిరంజీవికి జోడిగా ‘ఆచార్య’లో.. కమలహాసన్ నటిస్తున్న ‘ఇండియన్-2’లో నటిస్తూ బీజీగా ఉంది.
Also Read: సినీ ఇండస్ట్రీ: దసరా పాయే.. దీపావళికి పేలుతాయా?
కరోనాతో షూటింగులు వాయిదాపడటంతో కాజల్ పెళ్లిపై మనస్సు పారేసుకుంది. కరోనాతో వచ్చిన గ్యాప్ ను కాజల్ సద్వినియోగం చేసుకునే పనిలో పడింది. బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెబుతూ వివాహ జీవితంలోకి అడుగుపెట్టబోతుంది. తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన గౌతమ్ కిచ్లును ఆమె రేపు పెళ్లి చేసుకోబోతుంది.
మరికొన్ని గంటల్లో కాజల్ పెళ్లి జరుగనుండటంతో ముంబైలోని తన ఇంట్లో మెహందీ ఫంక్షన్ మొదలైంది. చేతికి మెహందీ పెట్టుకున్న ఫొటోలను కాజల్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు చూస్తుంటే కాజల్ కు పెళ్లికళ వచ్చేసిందనే విషయం అర్థమవుతోంది. ఇక పెళ్లి కొడుకు గౌతమ్ కిచ్లు ఇంట్లోనూ సంప్రదాయకంగా పెళ్ల వేడుక మొదలైంది.
Also Read: కాజల్ పెళ్లిసందడి షూరు.. ఫీలవుతున్న ఫాన్స్..!
అటూ కాజల్.. ఇటూ గౌతమ్ ఇంట్లో ఒకేసారి పెళ్లి పనులు మొదలయ్యాయి. కరోనా నేపథ్యంలో కాజల్ పెళ్లి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో జరుగనుంది. మరికొన్ని గంటల్లో కాజల్ పెళ్లి జరుగనుండటంతో ఆమె ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. ఇంకొన్నళ్లు పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు కదా అంటూ కామెంట్స్ పెడుతూ కాజల్ పై ఉన్న ప్రేమను అభిమానులు చాటుకుంటున్నారు.