పరీక్ష రాయకుండానే జేఈఈలో టాపర్ అయ్యాడు.. ఎలా సాధ్యమైందంటే..?

మారుతున్న కాలంతో పాటే విద్యార్థుల మధ్య పోటీ అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుత కాలంలో పాస్ కావడం సులభమే అయినా ర్యాంకులు సాధించడంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టాపర్ గా నిలవాలంటే ఎంతో శ్రమిస్తే తప్ప సాధ్యం కాదు. రేయింబవళ్లు కష్టపడి చదివిన వాళ్లు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో టాపర్లుగా నిలిచే అవకాశం ఉంది. అయితే ఒక వ్యక్తి మాత్రం పరీక్ష రాయకుండానే జేఈఈలో టాపర్ గా నిలిచాడు. కరోనా కారణంగా ప్రస్తుతం విద్యార్థుల చదువులు అస్తవ్యస్తమయ్యాయి. టీచర్ల […]

Written By: Kusuma Aggunna, Updated On : October 29, 2020 3:41 pm
Follow us on


మారుతున్న కాలంతో పాటే విద్యార్థుల మధ్య పోటీ అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుత కాలంలో పాస్ కావడం సులభమే అయినా ర్యాంకులు సాధించడంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టాపర్ గా నిలవాలంటే ఎంతో శ్రమిస్తే తప్ప సాధ్యం కాదు. రేయింబవళ్లు కష్టపడి చదివిన వాళ్లు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో టాపర్లుగా నిలిచే అవకాశం ఉంది. అయితే ఒక వ్యక్తి మాత్రం పరీక్ష రాయకుండానే జేఈఈలో టాపర్ గా నిలిచాడు.

కరోనా కారణంగా ప్రస్తుతం విద్యార్థుల చదువులు అస్తవ్యస్తమయ్యాయి. టీచర్ల గైడెన్స్ లేకపోవడంతో ఎంతో కష్టపడితే మాత్రమే ర్యాంకులు పొందే అవకాశం ఉంది. అయితే డాక్టర్ గా పని చేసే ఒక వ్యక్తి తన కొడుకు జేఈఈలో టాపర్ కావాలని భావించాడు. తన కొడుకు పరీక్ష రాస్తే అతను పాస్ కూడా కాడని తండ్రికి బాగా తెలుసు. దీంతో ఆ డాక్టర్ వేరే వ్యక్తితో పరీక్ష రాయించగా సదరు విద్యార్థి జేఈఈ మెయిన్స్ లో ఏకంగా 99.8 మార్కులు సాధించాడు.

ఇందుకోసం ఆ డాక్టర్ ఏకంగా 20 లక్షల రూపాయలు ఖర్చు చేయడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే అస్సాంకు చెందిన డాక్టర్ జ్యోతిర్మయి దాస్, తనక్ కొడుకు నీల్ నక్షత్ర దాస్ కు బదులుగా మరో వ్యక్తితో పరీక్ష రాయించి టాపర్ అయ్యేలా చేశాడు. అయితే నీల్ నక్షత్ర దాస్ తాను టాపర్ ఎలా అయ్యాడో అతని స్నేహితులకు చెప్పగా ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ ఘటనలో తండ్రీ కొడుకుతో పాటు ముగ్గురి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. గౌహతిలో ప్రముఖ గైనకాలజిస్టు అయిన జ్యోతిర్మయి దాస్ చీటింగ్ కు పాల్పడటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈయన భార్య కూడా డాక్టర్ కావడం గమనార్హం. ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.