https://oktelugu.com/

కరోనా నుంచి ఆ అగ్ర హీరో ఎస్కేప్ అయినట్టేనా? 

చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. జిత్తులమారి చైనా మాదిరిగానే కరోనా రోగం కూడా ఓ మానానా అంతుపట్టడం లేదు. చిన్న.. పెద్ద.. పేద.. ధనిక అనే తేడా లేకుండా అందరిపై తన ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు.. వృద్ధులపై కరోనా ప్రభావం అధికంగా ఉండటం ఆందోళన రేపుతోంది. Also Read: కాజల్ పెళ్లిసందడి షూరు.. ఫీలవుతున్న ఫాన్స్..! కరోనాతో ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ సెలబ్రెటీలు ప్రాణాలు కోల్పోయాయి. ఇటీవలే […]

Written By:
  • NARESH
  • , Updated On : October 29, 2020 / 03:51 PM IST
    Follow us on

    చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. జిత్తులమారి చైనా మాదిరిగానే కరోనా రోగం కూడా ఓ మానానా అంతుపట్టడం లేదు. చిన్న.. పెద్ద.. పేద.. ధనిక అనే తేడా లేకుండా అందరిపై తన ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు.. వృద్ధులపై కరోనా ప్రభావం అధికంగా ఉండటం ఆందోళన రేపుతోంది.

    Also Read: కాజల్ పెళ్లిసందడి షూరు.. ఫీలవుతున్న ఫాన్స్..!

    కరోనాతో ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ సెలబ్రెటీలు ప్రాణాలు కోల్పోయాయి. ఇటీవలే ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, మాజీ హోంమంత్రి నాయని నర్సింహారెడ్డి కరోనాతో మృత్యువాతపడ్డారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుటుంబం.. సంగీత దర్శకుడు కీరణవాణి కుటుంబం సైతం కరోనా బారినపడి కోలుకున్నారు. తాజాగా రాజశేఖర్ కుటుంబం సైతం కరోనా బారినపడటంతో టాలీవుడ్లో టెన్షన్ మొదలైంది.

    రాజశేఖర్ కుటుంబం మొత్తం కరోనా బారినపడగా తొలుత ఆయన ఇద్దరు కూతుళ్లు శివాత్మిక.. శివాని కరోనా నుంచి బయటపడ్డారు. కొద్దిరోజుల చికిత్స తర్వాత రాజశేఖర్ భార్య జీవిత కూడా కరోనా నుంచి కోలుకున్నారు. హీరో రాజశేఖర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆయన కూతురు శివాత్మిక ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు చేయడంలో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

    డాడీ త్వరగా కోలుకోవాలని అభిమానులంతా ప్రార్థించండి అంటూ శివాత్మిక ట్వీట్ చేయగా మెగాస్టార్ చిరంజీవి రీట్వీట్ చేసి ఆమెకు ధైర్యం చెప్పాడు. కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజశేఖర్ ఆరోగ్యం మెరుగు అవుతుందని తాజాగా జీవిత వెల్లడించారు. ఆయన వేగంగా కోలుకుంటున్నారని.. రాజశేఖర్ బాడీలోని ఇన్ఫెక్షన్లూ తగ్గినట్లేనని ఆమె తెలిపారు.

    Also Read: హిట్ సినిమాలు పవన్‌ కళ్యాణ్ ఎందుకు వదలుకున్నాడు?

    కొన్ని పరీక్షల అనంతరం మరో రెండ్రోజుల్లో ఆయనను వైద్యులు ఇంటికి పంపించే అవకాశం ఉందని జీవిత వెల్లడించారు. రాజశేఖర్ కరోనా నుంచి కోలుకుండటంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల ప్రార్థనల కారణంగా రాజశేఖర్ త్వరగా కరోనా నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ కరోనా నుంచి కోలుకోవడంతో టాలీవుడ్లో కొంత టెన్షన్ తగ్గినట్లు కన్పిస్తోంది.