https://oktelugu.com/

Kajal Agarwal Son : సినిమాల్లోకి కాజల్ అగర్వాల్ కొడుకు.. కానీ ఆమె పెడుతున్న కండిషన్స్ ఇవే!

Kajal Agarwal son : సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్.ఈమెకి యూత్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు, 37 ఏళ్ళ వయస్సు వచ్చినా, పెళ్లి చేసుకొని బిడ్డకి జన్మనిచ్చిన ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.రీ ఎంట్రీ లో కూడా ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి, స్టార్ హీరోలతో పాటుగా సీనియర్ హీరోలు కూడా ఆమెతో సినిమాలు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. సోషల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 8, 2023 / 08:44 PM IST
    Follow us on

    Kajal Agarwal son : సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్.ఈమెకి యూత్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు, 37 ఏళ్ళ వయస్సు వచ్చినా, పెళ్లి చేసుకొని బిడ్డకి జన్మనిచ్చిన ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.రీ ఎంట్రీ లో కూడా ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి, స్టార్ హీరోలతో పాటుగా సీనియర్ హీరోలు కూడా ఆమెతో సినిమాలు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు.

    సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే కాజల్ అగర్వాల్, పెళ్ళైన తర్వాత కూడా యాక్టీవ్ గా ఉంది కానీ, అభిమానులతో లైవ్ ఇంటరాక్షన్ బాగా తగ్గించేసింది.అందుకు కారణం ఆమె సినిమాలకు బ్రేక్ ఇవ్వడం వల్లే.కానీ ఇప్పుడు ఆమె ప్రధాన పాత్ర లో నటించిన ‘గోష్ఠి’ అనే తమిళ చిత్రం ఈ నెల 17 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.

    ఈ సందర్భంగా ఆమె అభిమానులతో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించింది.ఈ చిట్ చాట్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాదానాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.ఒక అభిమాని ‘మీ అబ్బాయిని బాలనటుడిగా ఇండస్ట్రీ లోకి తీసుకొస్తారా’ అని అడగగా కాజల్ అగర్వాల్ దానికి సమాధానం ఇస్తూ ‘కచ్చితంగా తీసుకొస్తాను..కానీ ఇప్పుడప్పుడే కాదు, వాడికి 8 ఏళ్ళ వయస్సు వచ్చిన తర్వాత సినిమాల్లోకి తీసుకొస్తాను.అప్పటి వరకు అటు వైపు కూడా చూడనివ్వను’ అంటూ సమాధానం ఇచ్చింది.

    ‘మీరు నటించిన సినిమాలలో మీ అబ్బాయికి మొట్టమొదటగా ఏ సినిమాని చూపిస్తారు’ అని అడగగా కాజల్ అగర్వాల్ దానికి ‘తుపాకీ’ అని సమాధానం ఇస్తుంది.ఇలా ఎన్నో క్రేజీ ప్రశ్నలకు కాజల్ అగర్వాల్ ఇచ్చిన సమాదానాలు ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తున్నాయి.