Jailer 2 Release Date: అతి కష్టమైన సమయం లో రజినీకాంత్(Superstar Rajinikanth) కెరీర్ ని నిలబెట్టిన చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అలాంటి సినిమాకు సీక్వెల్ రాబోతుంది అనగానే ఫ్యాన్స్ లోనే కాదు, ఆడియన్స్ లో కూడా ఈ చిత్రం పై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాల నడుమ మొదలైన ఈ చిత్రం దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రజినీకాంత్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ నెలాఖరుతో టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీని కూడా ఖరారు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని ఆగస్టు 14 న విడుదల చేయబోతున్నారట.
ఇదే తేదీన ఈ ఏడాది విడుదలైన ‘కూలీ’ మూవీ ఫలితం ఏంటో మనమంతా చూసాము. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. ఇతర రాష్ట్రాల్లో యావరేజ్ రేంజ్ లో ఆడినప్పటికీ, తమిళనాడు లో మాత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఫుల్ రన్ లో ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. కానీ కమర్షియల్ గా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. ఇప్పుడు అదే తేదీన ‘జైలర్ 2’ చిత్రం కూడా విడుదల అవ్వబోతుంది అనే వార్త రావడం తో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఈ తేదీన కాకపోతే, మరో తేదీలో విడుదల చేయొచ్చు కదా, ఎందుకు కలిసిరాని డేట్ లో మళ్లీ విడుదల చెయ్యాలని అనుకుంటున్నారంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు . త్వరలోనే దీనిపై స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇక ‘జైలర్’ చిత్రానికి సంగీతం అందించిన అనిరుద్ ‘జైలర్ 2’ కి కూడా అందిస్తున్నాడు. రజినీకాంత్ సినిమా అంటే అనిరుద్ కి ఎలాంటి పూనకం వస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పూనకం వచ్చినవాడిలాగా ఊగిపోయి మరీ మ్యూజిక్ ని వాయిస్తుంటాడు. ఇక ‘జైలర్ 2’ కి ఏ రేంజ్ మ్యూజిక్ అందిస్తాడో చూడాలి. ఇక ఈ చిత్రం లో విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి నటిస్తున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ కోసం మన నందమూరి బాలకృష్ణ ని సంప్రదించారట. కానీ ఆయన ఒప్పుకోలేదు, ఇప్పుడు ఆ స్థానం లో ఫహద్ ఫాజిల్ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.