
Pawan Kalyan – Sai Dharam Tej : పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ప్రముఖ నటుడు/దర్శకుడు సముద్ర ఖని ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడ్ లో కొనసాగుతుంది.పవన్ కళ్యాణ్ తన భాగానికి సంబంధించిన షూటింగ్ ని ఈ నెలలోనే పూర్తి చెయ్యబోతున్నాడు.తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా సీతం’ స్టోరీ లైన్ ని అడాప్ట్ చేసుకొని పవన్ కళ్యాణ్ రేంజ్ కి తగట్టుగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో నింపేసి ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడట డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.
ఏప్రిల్ లోపు షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి ఆగష్టు 11 వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట.ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ని ఉగాది కానుకగా ఈనెల 22 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నట్టు సమాచారం.
అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే రకరకాల టైటిల్స్ సోషల్ మీడియా లో బాగా ప్రచారమయ్యాయి.’దేవుడే దిగి వచ్చినా’, ‘దేవర’ వంటి టైటిల్స్ ఇప్పటికే ప్రచారం అయ్యాయి.కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న మరో టైటిల్ ‘దేవుడు’.ఏ టైటిల్ అయినా పెట్టండి కానీ ఈ టైటిల్ ని మాత్రం పెట్టొద్దు అంటూ అభిమానులు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.ఎందుకంటే గతం లో ఇదే పేరుతో బాలయ్య బాబు సినిమా ఒకటి విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.
అలా డిజాస్టర్ ఫ్లాప్ అయినా సినిమా పేరుని ముట్టుకోవద్దు అంటూ అభిమానులు ప్రాధేయపడుతున్నారు.మరి డైరెక్టర్ సముద్ర ఖని మనసులో ఏముందో చూడాలి.ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపిస్తున్నాడు, ఆయన లుక్స్ చాలా అల్ట్రా స్టైలిష్ గా ఉంటుందని, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ని అభిమానులు చూడని సరికొత్త కోణం లో ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తుంది.