IPL Mini Auction 2026: ఐపీఎల్ మినీ వేలం అబుదాబి వేదికగా మరికొద్ది గంటల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు సమర్థవంతమైన ప్లేయర్లను కొనుగోలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. జట్టుకు ఉపయోగకరంగా ఉండే ప్లేయర్ల కోసం భారీగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఐపీఎల్ లో మొత్తం పది జట్లు ఉంటాయి. అయితే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు వద్ద పర్స్ వేల్యూ ఎక్కువగా ఉంది. ఈ జట్టు వద్ద ఏకంగా 64.30 కోట్లు ఉన్నాయి. దీంతో ఈ జట్టు యాజమాన్యం ఎక్కువగా ప్లేయర్లను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే రిటైన్ జాబితాలో చాలామంది ప్లేయర్లను ఈ జట్టు పక్కన పెట్టింది. చివరికి వెంకటేష్ అయ్యర్ లాంటి ఆటగాడిని కూడా పక్కన పెట్టింది అంటే కోల్ కతా నైట్ రైడర్స్ యాజమాన్యం ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉందని అర్థం చేసుకోవచ్చు.
చెన్నై జట్టు కూడా చాలామంది ప్లేయర్లను వదిలేసుకుంది. ఆ జట్టు వద్ద కూడా భారీగానే పర్స్ వ్యాల్యూ ఉంది. ధోని సూచనల మేరకే చెన్నై యాజమాన్యం చాలామంది ప్లేయర్లను పక్కనపెట్టిందని తెలుస్తోంది. జట్టులోకి కొత్త రక్తం ఎక్కించాలని ధోని ఆకాంక్షమేరకే యాజమాన్యం ఆ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.. చెన్నై జట్టు లో కొంతమంది ప్లేయర్లు మాత్రమే ఉన్నారు.. వారికి తగ్గట్టుగా మిగతా వారిని తీసుకుంటే వచ్చే సీజన్లో ప్రభావం చూపించవచ్చని చెన్నై జట్టు ఆలోచన.
కోల్ కతా, చెన్నై జట్టు మాత్రమే కాకుండా మిగతా జట్లు కూడా ఐపీఎల్ లో సత్తా చూపించాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. యాజమాన్యాల వ్యవహార శైలి ఆ విధంగా ఉంటే.. మేనేజ్మెంట్ ఈసారి ఐపీఎల్లో మరో ట్విస్ట్ ఇచ్చింది. దీంతో జట్ల యాజమాన్యాలు కూడా ఒక్కసారిగా షాక్ కు గురయ్యాయి.
ఈసారి మినీ వేలంలో భారత ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ తో సహా 19 మంది ప్లేయర్లను జాబితాలో చేర్చింది బిసిసిఐ. దీంతో మొత్తం వేలంలో పాల్గొనే ప్లేయర్ల సంఖ్య 369 కి చేరుకుంది. వాస్తవానికి వేలానికి ముందు కొత్త ప్లేయర్లను చేర్చడం ఇదే తొలిసారి కాదు. కాకపోతే ఇంతమందిని చేర్చడం ఇదే తొలిసారి. మంగళవారం జరిగే మినీ వేలంలో పది జట్లు గరిష్టంగా 77 మంది ప్లేయర్లను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల నుంచి అబుదాబిలో వేలం మొదలవుతుంది. ఈ వేలం లో ఎవరు ఎక్కువ దక్కించుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.