Bigg Boss Telugu Season 9 : మరో 6 రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) పూర్తి అవ్వబోతుంది. సీజన్ 4 తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకున్న ఏకైక సీజన్ ఇదేనట. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సీజన్ ని చూసేందుకు అమితాసక్తిని చూపించారు. బంధాలు , అనుబంధాలు, ఎమోషన్స్ మధ్య ఒక మంచి డైలీ సీరియల్ ఫీలింగ్ ని కలిగించింది కాబట్టే ఈ సీజన్ అంత పెద్ద హిట్ అయ్యిందని అంటున్నారు. ఈ సీజన్ పూర్తి అయిన వెంటనే మరుసటి వారం లో ‘BB జోడి 2’ అనే డ్యాన్స్ ప్రోగ్రాం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ ప్రోగ్రాం కి సంబంధించిన రెండు ప్రోమోలు విడుదలయ్యాయి. మొదటి సీజన్ లో బిగ్ బాస్ జోడిలను ఎంచుకొని నడిపించారు. కానీ ఈ సీజన్ లో మాత్రం అలాంటి పరిస్థితి ప్రస్తుతానికి అయితే కనిపించడం లేదు.
ఈ షో లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లిస్ట్ ఒకసారి చూస్తే అమర్ దీప్ – నైనికా, మణికంఠ – ప్రియాంక సింగ్, అఖిల్ సార్థక్- వాసంతి, ధనరాజ్ – భాగ్యశ్రీ, చైతు – కీర్తి భట్, విశ్వా – నేహా, సాయి శ్రీనివాస్ – నయని పావని, మానస్ – శ్రేష్టి వర్మ, అర్జున్ కళ్యాణ్ – శ్రీ సత్య లు ప్రస్తుతానికి ఖరారు అయ్యారు. యాంకర్ ప్రదీప్ ఈ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా, శేఖర్ మాస్టర్ మరియు శ్రీదేవి జడ్జీలుగా వ్యవహరించబోతున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 9 నుండి పైన లిస్ట్ ని గమనిస్తే సాయి శ్రీనివాస్ మరియు శ్రేష్టి వర్మ మాత్రమే ఖరారు అయ్యారు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే, బిగ్ బాస్ 9 నుండి రీతూ చౌదరి – డిమోన్ పవన్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
వీళ్ళతో పాటు తనూజ, కళ్యాణ్ జంటని కూడా వైల్డ్ కార్డు ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట. ఒకవేళ కళ్యాణ్ రాకపోతే, తనూజ కి జోడీగా బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ నిఖిల్ ని తీసుకొస్తారట. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే వచ్చే వారం వరకు ఆగాల్సిందే. వీళ్ళతో ప్రియా శెట్టి కూడా ఈ షో లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని టాక్. ఒకవేళ ఇదే విధంగా ప్లాన్ చేస్తే ఈ సీజన్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పొచ్చు. మంచి కంటెస్టెంట్స్ ని పట్టుకొచ్చారు. వీళ్ళ మధ్య షో లో గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మొదటి సీజన్ కి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తే , రెండవ సీజన్ కి ప్రదీప్ యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. చూస్తుంటే రాబోయే రోజుల్లో ప్రదీప్ స్టార్ మా ఛానల్ లో అత్యధిక షోస్ ని ఆక్రమించేలా ఉన్నాడు.