IPL 2026 Auction Live Updates: అబుదాబి వేదికగా మరికొద్ది గంటల్లో ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టి ఈ వేలం మీద నెలకొంది. ఎవరికి ఎంత దరి దక్కుతుంది? ఏ ప్లేయర్లను ఏ జట్టు తీసుకుంటుంది? జట్ల ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయి? అనే అంశాలపై విస్తృతమైన కథనాలు మీడియాలో ప్రచారంలో ఉన్నాయి.
సాధారణంగా ఐపీఎల్ లో యంగ్ ప్లేయర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. పైగా ఐపిఎల్ అనేది కాసుల వేట కాబట్టి.. యాజమాన్యాలు విధ్వంసకారులకు రెడ్ కార్పెట్ వేస్తుంటాయి. వారికి విపరీతమైన ధర చెల్లిస్తుంటాయి. అయితే ఈసారి కూడా అటువంటి ప్లేయర్లకే అవకాశాలు దక్కుతాయని తెలుస్తోంది. పర్స్ వేల్యూ ప్రకారం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు వద్ద డబ్బులు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ జట్టు భారీగా ప్లేయర్లను తీసుకుంటుందని తెలుస్తోంది.
ఐపీఎల్ మినీ వేలంలో కొందరు ప్లేయర్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు గ్రీన్, శ్రీలంక ఆటగాడు హసరంగ, మిల్లర్, డికాక్, నోర్జీ, జెమీ స్మిత్, లివింగ్ స్టోన్, రవి బిష్ణోయ్, వెంకటేష్ అయ్యర్ ఉన్నారు. వీరిపై విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే వీరు బౌలింగ్, బ్యాటింగ్లో దుమ్ము లేపుతారు. ఫీల్డింగ్ లో కూడా సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతారు. అందువల్లే వీరికి ఈ ఐపీఎల్లో విపరీతమైన డిమాండ్ ఉండే అవకాశం కనిపిస్తోంది.
ముఖ్యంగా వెంకటేష్ అయ్యర్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును 2024 లో ఛాంపియన్ గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు. గత సీజన్లో మాత్రం అతడు అంచనాలను అందుకోలేకపోయాడు. ఇక ప్రస్తుతం టీమిండియాతో టీ 20 సిరీస్ లో డికాక్ సత్తా చూపిస్తున్నాడు. రెండో టీ 20 మ్యాచ్ లో ఏకంగా సెంచరీ దాకా వచ్చాడు. ప్రస్తుతం అతడి ఆట తీరు కూడా నిలకడగా ఉంది కాబట్టి.. మినీ వేలంలో భారీగా ధర దకే అవకాశం ఉందని తెలుస్తోంది. లివింగ్ స్టోన్ కూడా భారీగా ధర దక్కించుకుంటాడని ప్రచారంలో ఉంది. గత సీజన్ లో పృథ్వీ షా, సర్ఫ రాజ్ వంటివారు అమ్ముడుపోలేదు. ఈసారి ఏమైనా వారు అమ్ముడుపోతారేమోనని చర్చ నడుస్తోంది.