https://oktelugu.com/

రూపాయి ఖర్చు లేదు కాబట్టే.. హనీమూన్ కి ఒప్పుకుందట !

కాజల్‌ అగర్వాల్‌  తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లుతో వివాహబంధంలోకి అడుగుపెట్టగానే..  ఈ జంట హనీమూన్‌ కోసం మాల్దీవులకు వెళ్లారు. అక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటి నీటి అడుగున ఉన్న ‘ది మురాకా హోటల్ ’‌లో కాజల్‌ జంట పదిరోజులపాటు బస చేసింది.  కూడా.  ఈ హోటల్‌లో ఒకరాత్రి బస చేయాలంటే దాదాపు రూ.38 లక్షలు అవుతుందట. అంటే… పదిరోజులకు గానూ అలాగే ఇతర ఖర్చులకు గానూ మొత్తం కాజల్‌ దాదాపు రూ.5 కోట్లు ఖర్చు పెట్టిందని అనేక రూమర్స్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 7, 2020 / 01:48 PM IST
    Follow us on

    కాజల్‌ అగర్వాల్‌  తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లుతో వివాహబంధంలోకి అడుగుపెట్టగానే..  ఈ జంట హనీమూన్‌ కోసం మాల్దీవులకు వెళ్లారు. అక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటి నీటి అడుగున ఉన్న ‘ది మురాకా హోటల్ ’‌లో కాజల్‌ జంట
    పదిరోజులపాటు బస చేసింది.  కూడా.  ఈ హోటల్‌లో ఒకరాత్రి బస చేయాలంటే దాదాపు రూ.38 లక్షలు అవుతుందట. అంటే… పదిరోజులకు గానూ అలాగే ఇతర ఖర్చులకు గానూ మొత్తం కాజల్‌ దాదాపు రూ.5 కోట్లు ఖర్చు పెట్టిందని అనేక రూమర్స్ వచ్చాయి. అయితే కాజల్‌ తన హనీమూన్‌ కోసం ఒక్కరూపాయి కూడా ఖర్చు పెట్టలేదట.

    Also Read: పూనమ్ కౌర్ ట్వీట్.. ఆ హీరోపైనేనా?
    మాల్దీవుల ప్రభుత్వం ఏ సెలబ్రిటీకైతే ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఉంటారో వాళ్లు మాల్దీవులకు వచ్చినప్పుడు అక్కడ అయ్యే హోటల్‌ ఖర్చులన్నీ  ఉచితంగా అందిస్తోందట. తమ పర్యాటక రంగాన్ని విదేశీయులకు ముఖ్యంగా భారతీయులకు చేరువచేయాలనే ఆలోచనలో  మాల్దీవుల ప్రభుత్వం హీరోయిన్లను ఆకట్టుకుంటూ ఆ రకంగా ముందుకుపోతుంది. పైగా ఇన్‌స్టాలో 5 మిలియన్ల కంటే ఎక్కువమది ఫాలోవర్స్‌ ఉన్న సెలబ్రిటీకి అన్ని ఫ్రీనే అట.  హోటల్‌ రూమ్‌ దగ్గర నుండి టిక్కెట్లు వరకూ అన్ని ఉచితమే. మరి ఈ ఉచితాన్ని  కాజల్‌ ఎందుకు వద్దు అంటుంది. అందుకే  రూపాయి కూడా ఖర్చు చేయకుండా హనీమూన్‌ ను ఎంజాయ్ చేసి వచ్చింది.

    Also Read: రజినీకాంత్ రాజకీయ ఎంట్రీపై కట్టప్ప హాట్ కామెంట్స్
    అసలు రూపాయి ఖర్చు లేదు కాబట్టే.. కాజల్ హనీమూన్ కి ఒప్పుకుందని నెటిజన్లు సెటైర్లు కూడా వేస్తున్నారు. మొత్తానికి హీరోయిన్స్ అందరూ ఎప్పుడూ చాల ప్లాన్డ్ గానే ఉంటారు. తమకు క్రేజ్ ఉండగానే  ఫుల్ గా క్యాష్ చేసేసుకోవడానికి సర్వదా ముందు ఉంటుంటారు.  దీనికితోడు కరోనా… మళ్ళీ సినిమాలతో ఎప్పుడు బిజీ అవుతామో.. అందుకే వచ్చిన అవకాశాలను ఎందుకు వదులుకోవాలి అనుకుంది కాజల్. కాజల్ ఒక్కటే కాదు,  ప్రస్తుతం హీరోయిన్స్ అంతా  ఈ  లాక్ డౌన్ టైమ్ లో  తమ సోషల్ మీడియా ఎకౌంట్స్ నే ఆదాయ వనరుగా మార్చుకుని.. తమ ఫాలోయింగ్ ను కమర్షియల్ గా మార్చుకుంటూ ఆ రకంగానూ సంపాదిస్తూ  ఉన్నారు.

    మరిన్ని వార్తలు కోసం: వైరల్