https://oktelugu.com/

ధర్మాన యాక్టివ్‌… కారణం అదేనా..?

  వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మళ్లీ యాక్టివ్‌ అయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచాక  నియోజకవర్గం దాటని ఆయన ఇప్పుడు జిల్లా మొత్తం పర్యటిస్తున్నారు.  అయితే ఇందుకు కారణం లేకపోలేదు.  జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కావడంతో సీఎం జగన్ ఆదేశాలతోనే ఆయన రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. గతంలో మంత్రిగా ధర్మానకు జిల్లాలో మంచి పట్టు ఉండడంతో జగన్‌ ఆయనను యాక్టివ్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. Also Read: చంద్రబాబుకు చుక్కలేనా? స్టీఫెన్ ను దించుతున్న […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 7, 2020 / 01:54 PM IST
    Follow us on

     

    వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మళ్లీ యాక్టివ్‌ అయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచాక  నియోజకవర్గం దాటని ఆయన ఇప్పుడు జిల్లా మొత్తం పర్యటిస్తున్నారు.  అయితే ఇందుకు కారణం లేకపోలేదు.  జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కావడంతో సీఎం జగన్ ఆదేశాలతోనే ఆయన రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. గతంలో మంత్రిగా ధర్మానకు జిల్లాలో మంచి పట్టు ఉండడంతో జగన్‌ ఆయనను యాక్టివ్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

    Also Read: చంద్రబాబుకు చుక్కలేనా? స్టీఫెన్ ను దించుతున్న జగన్?

    జిల్లాపై ధర్మానకు మంచి పట్టు
    ధర్మాన ప్రసాదరావుకు వైఎస్‌ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో  శ్రీకాకుళం జిల్లాపై మంచిపట్టు ఉన్నది.  ఏ ప్రోగ్రాం అయినా ఆయన కనుసన్ననల్లోనే జరిగేది. యువకుడిగా ఉన్నపుడే ఎమ్మెల్యేగా గెలిచిన ధర్మాన నేదురుమల్లి జనార్ధనరెడ్డి మంత్రివర్గంలోనూ మంత్రిగా పనిచేశారు. అసెంబ్లీలో విపక్షంలో ఉన్నా కూడా మంచి సబ్జెక్ట్ తో మాట్లాడేవారు.   శ్రీకాకుళం జిల్లాలో ఎర్రన్నాయుడు కుటుంబం కంటే ముందే మంత్రి పదవులు పొందడ విశేషం.

    Also Read: అన్నతోని కాలేదు… తమ్ముడైనా సక్సెస్‌ అయితడా..?

    2014లో ఓటమి
    2014 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చిన ధర్మాన ప్రసాదరావు ఓటమి పాలయ్యారు.  అయితే అప్పట్లో ఆయన  పులివెందులలో  గెలవడం కాదు, శ్రీకాకుళంలో గెలవాలి అంటూ జగన్‌పై చేసిన కామెంట్లు  సంచలనం సృష్టించాయి. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినా ఆ కామెంట్లే కారణమని పార్టీలో ప్రచారం ఉన్నది.  ధర్మాన కూడా ఇన్నాళ్లు సైలెంట్‌గానే ఉన్నారు.  కానీ అన్న క్రిష్ణ దాస్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక జోరు పెంచుతున్నారు.
    అచ్చెంనాయుడుకు చెక్‌ పెట్టేందుకేనా..?
    నిన్నటివరకు  నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్న ధర్మాన ఇప్పుడు  జిల్లా అంతటా తిరుగుతున్నారు.  కాంగ్రెస్‌లో  మంత్రిగా ఉన్నప్పుడు సంపాదించుకున్న అనుచరులను కూడా యాక్టివ్‌ చేస్తున్నారు. ఇటీవల టెక్కలి, పలాసా, ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించగా  వైసీపీ శ్రేణులు గ్రూపులను మరిచిపోయి ఘన స్వాగతం పలికాయి. ఆయన కూడా అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకెళ్లారు.  అయితే జగన్‌ చెప్పడంతోనే ధర్మాన ఇదంతా చేస్తున్నారని తెలుస్తోంది.  ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుకు చెక్‌ పెట్టేందుకు ధర్మానను రంగంలోకి దింపారని ప్రచారం జరుగుతోంది.  కాగా,   మంత్రివర్గ విస్తరణ జరిగితే  ధర్మానకు అవకాశం గ్యారంటీ అని అనుచరులు సంబరపడుతున్నారు.  అన్న  డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌ బదులు అవకాశం   ఇవ్వాలని కోరుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో…!

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్