Viral Video: మీడియా అనేది నిష్పక్షపాతంగా ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. వార్తల విషయంలో ఏకపక్ష విధానాన్ని అవలంబించకూడదు. అది పెద పోకడలకు దారితీస్తుంది.. అయితే మారుతున్న కాలంలో మీడియాలో పనిచేస్తున్న వారు సర్వ పరిత్యాగులుగా ఫీల్ అయిపోతున్నారు. తమను తాము ప్రశ్నించే శక్తులుగా అభివర్ణించుకుంటున్నారు ఇదే సమయంలో లైన్ దాటి వ్యవహరిస్తున్నారు. అసలు ఇప్పుడు సోషల్ మీడియా కాలం కాబట్టి.. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే కాలం కాబట్టి.. అడ్డంగా దొరికిపోతున్నారు. వెనకటి కాలంలో అయితే మీడియాను ప్రశ్నించే శక్తులు ఉండేవి కాదు. కానీ ఇప్పుడలా కాదు కదా.. మీడియాను ఎదిరించడానికి.. మీడియాను ప్రశ్నించడానికి.. మీడియాలో పనిచేస్తున్న వ్యక్తులను నడి బజార్లో నిలబెట్టడానికి సోషల్ మీడియా ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. అందువల్లే మీడియాలో పనిచేస్తున్న వ్యక్తుల అసలు బాగోతాలు.. వారు వేసుకున్న తెరవెనక రంగులు బయటపడుతున్నాయి.
ఓ వీడియో ప్రకారం..
ఇటీవల ఓ ప్రముఖ చానల్లో పనిచేసే ఓ పాత్రికేయుడు ముఖాముఖి నిర్వహించారు. ఇందులో భాగంగా అఘోరిని ప్రశ్నించారు. ఇద్దరి మధ్య ప్రశ్నల పరంపర సాగుతూ ఉండగానే.. ఆ జర్నలిస్ట్ లైన్ తప్పారు. ఆ అఘోరిని ఆ జర్నలిస్ట్ “శవాలను పీక్కుతింటున్నారు కదా” అని ప్రశ్నించారు. దానికి ఆ అఘోరి కూడా అదే స్థాయిలో ప్రతి సమాధానం చెప్పారు. ” మీరు పాత్రికేయుడే కదా.. మరి మీరు ఏం పీకుతున్నారు జర్నలిజంలో” అంటూ కౌంటర్ ఇచ్చారు.. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియదు గాని.. ఈ వీడియోను వైసిపి అనుకూల నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ పాత్రికేయుడు వైసిపికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. తన సోషల్ మీడియాలో కూడా అదేపనిగా విమర్శలు చేస్తుంటారు. చాలాకాలం తర్వాత ఆ పాత్రికేయుడు ఇలా దొరికిపోవడంతో వైసిపి అభిమాన నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇది ఇతడి అసలు స్వరూపం అంటూ మండిపడుతున్నారు.
మరోవైపు ఈ వీడియో పట్ల టిడిపి నాయకులు కూడా స్పందిస్తున్నారు.. ఏదో చర్చ జరుగుతున్నప్పుడు పాత్రికేయుడుగా ఆయన ప్రశ్నలు అడిగారని.. ఇష్యూ ఆధారంగానే ఆయన ఆ పని చేశారని.. ఇందులో తప్పు పట్టడానికి ఏముందని టిడిపి నాయకులు అంటున్నారు.. గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయని.. వాటిని ఆ పాత్రికేయుడు వెలుగులోకి తీసుకొచ్చారని.. ఆ మాత్రం దానికి కక్ష కడతారా అంటూ విమర్శిస్తున్నారు.. ఆయన పాత్రికేయంలో చాలా సంవత్సరాల పాటు ఉన్నారని.. ఆయనకు వార్తలు, వార్తలు వెనక ఉన్న అసలు విషయాలు తెలుసని.. అందువల్లే ఇన్ని సంవత్సరాలపాటు ఆ విభాగంలో మచ్చ లేకుండా కొనసాగుతున్నారని టిడిపి నాయకులు వివరిస్తున్నారు. ఇలాంటి చవక బారు వీడియోల వల్ల జరిగేది ఏదీ ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వారు హితవు పలుకుతున్నారు.
మూర్తి ఎం పికుతున్నావ్ జర్నలిజం ముసుగులో
___ft అగోరి asking pic.twitter.com/5jrZzwdf3K— Madhu! (@ysj_madhureddy) January 30, 2025