Hero Nani
Hero Nani: ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టి, తర్వాత హీరోగా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకోవడం అనేది మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. అలా మన ఇండస్ట్రీ లో రవితేజ తర్వాత నాని మాత్రమే నిలబడ్డాడు. కెరీర్ ప్రారంభం లో నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా కృష్ణ వంశీ , రాఘవేంద్ర రావు, పూరి జగన్నాథ్, మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఇలా ఎంతో మంది డైరెక్టర్స్ గా పని చేసాడు. మంచి లుక్స్ ఉండడంతో సురేష్ బాబు ఇతన్ని హీరోగా చేస్తూ ‘అష్టా చమ్మా’ అనే చిత్రం చేసాడు. కమర్షియల్ గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో నాని టాలీవుడ్ ప్రముఖుల దృష్టిలో పడ్డాడు. వరుసగా క్రేజీ ఆఫర్స్ ని సొంతం చేసుకుంటూ అనతి కాలంలోనే నేచురల్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు నాని సినిమా అంటే మినిమం గ్యారంటీ.
ఆయన సినిమా థియేటర్స్ లోకి వస్తుందంటే కళ్ళు మూసుకొని వేరే ఆలోచనలు పెట్టుకోకుండా వెళ్లిపోవచ్చు అనే బ్రాండ్ ఇమేజి ని, నమ్మకాన్ని ఆడియన్స్ లో కలిగించుకున్నాడు. ‘దసరా’ చిత్రంతో తొలిసారి వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకున్న నాని, ‘సరిపోదా శనివారం’ చిత్రంతో రెండవసారి కూడా వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకున్నాడు. ఇప్పుడు ఆయన తనకి ‘దసరా’ వంటి హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల తో కలిసి ‘ది ప్యారడైజ్’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే నాని కి ఉన్న టాలెంట్ కి ఎప్పుడో పాన్ ఇండియన్ స్టార్ హీరో అవ్వాల్సింది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల స్క్రిప్ట్స్ ని రిజెక్ట్ చేయడం తో బంగారం లాంటి అవకాశాన్ని వదులుకున్నాడు. అలా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ గా నిల్చిన ఒక చిత్రాన్ని నాని వదులుకోవాల్సి వచ్చింది.
ఆ సినిమా మరేదో కాదు, గత ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం గా నమోదు చేసుకొని, సుమారుగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ‘అమరన్’ చిత్రం. శివ కార్తికేయన్ హీరో గా నటించిన ఈ సినిమా తెలుగు లో కూడా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ ముందుగా నాని కే వచ్చిందట. కానీ తన డేట్స్ అప్పటికే ‘సరిపోదా శనివారం’ కి ఇవ్వడంతో ఈ చిత్రాన్ని చేయలేకపోయాడు. ఒకవేళ ఆయన ఒప్పుకొని ఈ సినిమా చేసుంటే నేడు నాని ఖాతాలో 400 కోట్ల రూపాయిల గ్రాసర్ ఉండేది. పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు లభించేది. ఓటీటీ లో కూడా ఈ చిత్రానికి గ్లోబల్ వైడ్ గా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నాని కి ఆ అవకాశం కూడా చేజారిపోయింది. మొత్తానికి కెరీర్ లో ఈ చిత్రాన్ని వదులుకోవడం నాని కి పెద్ద మైనస్ అనే చెప్పుకోవాలి.