Homeఅంతర్జాతీయంJaso dog transformation : నీ పిచ్చి పాసుగాలా.. కుక్కలా మారడానికి ఈ మనిషి 220...

Jaso dog transformation : నీ పిచ్చి పాసుగాలా.. కుక్కలా మారడానికి ఈ మనిషి 220 కోట్లు ఖర్చు పెట్టాడు..

Jaso dog transformation : మిగతా జంతువులతో పోల్చి చూస్తే మనుషుల్లో జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. వారి ఆలోచన అద్భుతంగా ఉంటుంది. అందువల్లే ప్రకృతి మీద.. మిగతా జంతువుల మీద మనిషి పెత్తనం బ్రహ్మాండంగా సాగిపోతూ ఉంటుంది. అయితే రాను రాను రాజుగారి గుర్రం గాడిద అయినట్టు.. వివేకం కలిగి ఉన్న మనిషి చివరికి జంతువు స్థాయికి దిగజారిపోతున్నాడు. ఎవరైనా సరే అందంగా ఉండాలని కోరుకుంటారు. ఒకవేళ అంద విహీనంగా ఉంటే అందంగా మారాలని భావిస్తుంటారు. శరీర […]

Jaso dog transformation : మిగతా జంతువులతో పోల్చి చూస్తే మనుషుల్లో జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. వారి ఆలోచన అద్భుతంగా ఉంటుంది. అందువల్లే ప్రకృతి మీద.. మిగతా జంతువుల మీద మనిషి పెత్తనం బ్రహ్మాండంగా సాగిపోతూ ఉంటుంది. అయితే రాను రాను రాజుగారి గుర్రం గాడిద అయినట్టు.. వివేకం కలిగి ఉన్న మనిషి చివరికి జంతువు స్థాయికి దిగజారిపోతున్నాడు.

ఎవరైనా సరే అందంగా ఉండాలని కోరుకుంటారు. ఒకవేళ అంద విహీనంగా ఉంటే అందంగా మారాలని భావిస్తుంటారు. శరీర ఆకృతిని మార్చుకుంటారు. జుట్టు దగ్గర నుంచి మొదలు పెడితే గోర్ల వరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. లేని అందాన్ని తెచ్చుకోవడానికి.. ఉన్న అందానికి మెరుగులు దిగడానికి చాలామంది డబ్బులు భారీగా ఖర్చు పెడుతుంటారు.

ఈ వ్యక్తి మాత్రం అందరికంటే భిన్నంగా ఆలోచించాడు. ఆలోచించడం మాత్రమే కాదు దానిని ఆచరణలో కూడా పెట్టాడు. కాకపోతే అది అత్యంత ఖరీదైన వ్యవహారం. ఇంత ఖరీదు ఏందంటే అతడు పెట్టిన ఖర్చుతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మరుగుదొడ్లను.. మధ్యాహ్నం భోజనం తయారు చేయడానికి వంట గదులను నిర్మించవచ్చు. విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్లు కూడా ఏర్పాటు చేయవచ్చు. ఇంకా ఏమైనా డబ్బులు మిగిల్తే వాళ్లకు ఇతర సదుపాయాలు కల్పించవచ్చు. అలా పెట్టడం మరి ఇతడు ఖర్చు.

జాసో అనే ఓ వ్యాపారవేత్తకు విచిత్రమైన ఆలోచనలు వస్తుంటాయి. తాజాగా ఇతడికి కుక్కలా మారిపోవాలని అనిపించింది. ఇంకేముంది దానికోసం భారీగా ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. ఇందుకోసం 220 కోట్లను హారతి కర్పూరం లాగా ఖర్చు చేశాడు. ఇతడికి కుక్కలు అంటే చాలా ఇష్టం. కుక్క మాదిరిగా తన శరీరాన్ని మార్చుకున్నాడు. ఆపరేషన్ కోసం భారీగా వెచ్చించాడు. అతడు కుక్కలా మారిపోయిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తుంది. అతని శరీరం.. చూపు.. ఆకృతి అన్ని కుక్క మాదిరిగానే కనిపిస్తున్నాయి. అతడు కుక్క మాదిరిగానే కదలికలు చేస్తున్నాడు.

ఈ వీడియో మీద ఫ్యాక్ట్ చెక్ బృందం రంగంలోకి దిగింది. జాసో అనే వ్యాపారవేత్త నిజంగానే 220 కోట్లు ఖర్చు చేశాడా.. అని ఆరా తీసింది. అయితే అతడు ఆ స్థాయిలో ఖర్చుపెట్టలేదని.. కుక్కలా మారిపోవడానికి అతడు తాపత్రయ పడలేదని.. కేవలం సోషల్ మీడియాలో వ్యూస్.. లైక్స్ కోసమే ఇలాంటి ప్రయత్నం చేశాడని.. అంతకుమించి ఏమీ లేదని తెలియ వచ్చింది. ఇక ఆ వీడియోలో కనిపిస్తున్న ఆ వ్యక్తి కేవలం కుక్క మాదిరిగా డ్రెస్ రూపొందించుకున్నాడని.. దానిని ధరించి అలా కనిపించాడని ఫ్యాక్ట్ చెక్ పరిశీలనలో తేలింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper