Homeఆంధ్రప్రదేశ్‌Jagan Vs Chandrababu: జగన్ వర్సెస్ చంద్రబాబు.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపెవరిది?

Jagan Vs Chandrababu: జగన్ వర్సెస్ చంద్రబాబు.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపెవరిది?

Jagan Vs Chandrababu
Jagan Vs Chandrababu

Jagan Vs Chandrababu: రాష్ట్రంలో మరో ఎన్నిక రసవత్తరంగా మారింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాభవాన్ని మూటగట్టుకున్న అధికార వైసిపి.. ఈ ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటాలని భావిస్తుంటే.. మరోసారి అధికార పార్టీకి ఝలక్ ఇవ్వాలని టిడిపి వ్యూహం సిద్ధం చేస్తోంది. అసలు ఏమిటా ఎన్నిక..? ఆ కథ కమామిషు ఏంటో చూద్దాం.

ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మరో ప్రతిష్టాత్మక పోరుకు రంగం సిద్ధమైంది. పట్టబద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తర్వాత జరగనున్న ఎమ్మెల్సీ కోట ఎన్నిక రాజకీయ ఉత్కంఠతను పెంచుతోంది. ఏడు స్థానాల కోసం ఎనిమిది మంది బరిలో ఉన్నారు. రెండు పార్టీల్లోని రెబల్స్ కీలకంగా మారుతున్నారు. ఒక్క ఓటు మాత్రమే గెలుపు ఓటముల మధ్య తేడా కనిపిస్తోంది. చివరి నిమిషంలో ఏం జరుగుతుందో..? గెలుపు ఎవరిదో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఏడు స్థానాలకు.. ఎనిమిది మంది పోటీ..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో పోలింగ్ జరగనుంది. వైసీపీ నుంచి ఏడుగురు, టిడిపి నుంచి ఒక్కరు ఈ ఏడు స్థానాల కోసం పోటీ చేస్తున్నారు. ఏడుగురు అభ్యర్థులు గెలుపొందటానికి ఎక్కువ అభ్యర్థికి 22 ఓట్లు అవసరం అవుతాయి. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. టిడిపి జనసేన నుంచి గెలిచిన మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అదే సమయంలో ఆనం, కోటంరెడ్డి పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చే అవకాశం లేదు. దీంతో వైసీపీ బలం 154 గా ఉంది. సరిగ్గా, ఏడుగురు అభ్యర్థుల విజయానికి కావాల్సిన బలం ఇదే. పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీ శిబిరాలు – మాక్ పోలింగ్తో ప్రత్యేకంగా మంత్రులకు ఏడు టీమ్ లుగా ఏర్పాటు చేసి ఇన్చార్జులను నియమించి జాగ్రత్తలు తీసుకుంది.

వ్యూహాలకు పదును పెడుతున్న టిడిపి..

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. సాధారణంగా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకునేందుకు ఈ సంఖ్య సరిపోతుంది. అయితే, తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది శాసనసభ్యులు అధికార పార్టీకి దగ్గరయ్యారు. దీంతో తెలుగుదేశం పార్టీ బలం 19కి పడిపోయింది. సాధారణంగా అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. పార్టీ గుర్తుపై గెలిచి అధికార పార్టీకి దగ్గరైన వారి లెక్క తేల్చే ఉద్దేశంతో చంద్రబాబు ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. అధికార పార్టీతో విభేదించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి తమకు మద్దతు ఇస్తారని టిడిపి భావిస్తోంది. అదే సమయంలో తమతో టచ్ లో ఉన్న మరికొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎన్నికల్లో టిడిపి అభ్యర్థికి ఓటు వేస్తారని చంద్రబాబు భావించారు. ప్రస్తుతానికి టిడిపికి ఉన్న 19 మందితో పాటు అధికార పార్టీపై అసంతృప్తితో ఉన్న మరో ఇద్దరు కలిపి మొత్తంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 21 మంది ఎమ్మెల్యేలు మద్దతు లభిస్తున్నట్లయింది. ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవాలంటే మరో ఎమ్మెల్యే మద్దతు తెలుగుదేశం పార్టీకి అవసరం అవుతుంది. ఆ ఓటు సాధించేందుకు తెలుగుదేశం పార్టీ కొద్ది రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీలో టికెట్ రాదనే అభిప్రాయంతో ఉన్న కొందరు మాజీ టిడిపి ప్రస్తుత వైసిపి ఎమ్మెల్యేలతో టిడిపి కీలక నేతలు టచ్లోకి వెళ్లారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే టిడిపి గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి.

Jagan Vs Chandrababu
Jagan Vs Chandrababu

కీలకంగా ఒకే ఒక్క ఓటు..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో ఒకే ఒక్క ఓటు రెండు పార్టీలకు కీలకంగా మారింది. ఏడో స్థానాన్ని సాధించాలని కసిగా ఉన్న వైసీపీకి కావాల్సింది, ఒకే ఒక్క స్థానానికి పోటీ పెట్టిన టిడిపికి కావాల్సింది ఒకే ఒక్క ఓటు. ఈ ఓటు కోసం ఇరు పార్టీల నాయకులు వ్యూహ ప్రతి వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల్లో ట్విస్టుల ఉంటాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి. అదే సమయంలో టిడిపి కూడా మైండ్ గేమ్ ఆడుతూ వైసిపిని ఒత్తిడికి గురిచేస్తుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలను అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్న టిడిపి ఈ ఎన్నికల్లోనూ గెలుస్తామన్నది వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతానికి మాత్రం నెంబర్ గేమ్ లో వైసీపీది పై చేయిగా కనిపిస్తుండగా, తెలుగుదేశం పార్టీ మాత్రం తమకే మెజారిటీ ఉందని చెబుతుండడం వెనుక కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం వచ్చే తుది ఫలితంపైన ఇప్పుడు అందరి చూపు ఉంది.

RELATED ARTICLES

Most Popular