
NTR 30 Movie Launch: ఎన్నాళ్ళో వేచిన హృదయం అన్నట్లు… ఎన్నో అవాంతరాల తర్వాత ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. నేడు హైదరాబాద్ వేదికగా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కి టాలీవుడ్ అతిరథ మహారథులు హాజరయ్యారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్, దిల్ రాజు, బి వి ఎస్ ఎన్ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ, ప్రకాష్ రాజ్, మైత్రీ నవీన్ ఇలా టాలీవుడ్ బిగ్ షాట్స్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ 30 లాంచింగ్ ఈవెంట్లో జాన్వీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

శారీలో ఈవెంట్ కి హాజరైన జాన్వీ కపూర్ అందరితో ముచ్చటించారు. ఎన్టీఆర్ ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించారు. రాజమౌళి-జాన్వీ మధ్య కొన్ని నిమిషాల పాటు చర్చలు నడిచాయి. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. గతంలో రాజమౌళి శ్రీదేవితో కలిసి పనిచేయాలనుకున్నారు. బాహుబలి మూవీలో రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్ర కోసం మొదట అనుకుంది శ్రీదేవినే. భవిష్యత్ లో ఆమె వారసురాలు జాన్వీతో రాజమౌళి మూవీ చేసే అవకాశం కలదు.
Sensational directors @ssrajamouli and #PrashanthNeel at the #NTR30 Puja and opening ceremony.
– https://t.co/Uh0d9lsc89#NTR30Begins@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sreekar_prasad @YuvasudhaArts pic.twitter.com/IXZiYRR0BH
— NTR Arts (@NTRArtsOfficial) March 23, 2023
ఇక ఎన్టీఆర్-జాన్వీ కపూర్ మీద రాజమౌళి క్లాప్ కొట్టారు. ప్రశాంత్ నీల్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఎన్టీఆర్ 30 రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. ఫిబ్రవరిలోనే మూవీ లాంచ్ కావాల్సింది. తారకరత్న మరణంతో ఆలస్యమైంది. ఎన్టీఆర్ 30 విడుదల తేదీ చాలా దగ్గరగా ఉంది. 2024 ఏప్రిల్ 5న సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

మరి ఏడాది సమయం మాత్రమే ఉండగా… ఎన్టీఆర్ 30 చెప్పిన తేదీకే థియేటర్స్ లో దిగుతుందా లేదా అనేది చూడాలి. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారంటూ ఓ ప్రచారం జరుగుతుంది. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్-జాన్వీ కాంబో మరింత ఆసక్తి కలిగిస్తుంది.
#NTR30 Muhurtham clicks 😍😍@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @ssrajamouli #prashanthNeel @anirudhofficial @prakashraaj pic.twitter.com/KzyTigO4wQ
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 23, 2023