
Sudigali Sudheer: బుల్లితెరకు ఆల్మోస్ట్ దూరమయ్యాడు సుడిగాలి సుధీర్. హీరోగా ఆఫర్స్ వస్తుండగా అటు వైపు దృష్టి పెట్టాడు. సుడిగాలి సుధీర్ మూడో చిత్రంతో హిట్ కొట్టారు . గత ఏడాది విడుదలైన గాలోడు విజయం సాధించింది. హీరోగా తొలి విజయం అందుకున్నారు. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ మూవీతో హీరో అవతారం ఎత్తిన సుధీర్ కి నిరాశ ఎదురైంది. అనంతరం తన ఇద్దరు మిత్రులతో కలిసి త్రీ మంకీస్ టైటిల్ తో మరో మూవీ చేశారు. ఇది కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే గాలోడు మూవీతో సక్సెస్ టేస్ట్ చూశారు.
గాలోడు వసూళ్లు ట్రేడ్ వర్గాలను విస్మయపరిచాయి. సుధీర్ కి ఇంత ఫాలోయింగ్ ఉందా అని ఆశ్చర్యపోయారు. ఈ జోష్ లో సుధీర్ తన నాలుగో చిత్రం ప్రకటన చేశారు. ఉగాది కానుకగా సుధీర్ కొత్త ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఫ్యాన్స్ తో పంచుకున్నారు. దర్శకుడు నరేష్ కుప్పిలి ఈ చిత్ర దర్శకుడు. గతంలో ఆయన విశ్వక్ సేన్ హీరోగా పాయల్ మూవీకి దర్శకత్వం వహించారు. తన రెండో చిత్రం సుధీర్ తో చేస్తున్నారు.
సుడిగాలి సుధీర్ ప్రకటన ఫ్యాన్స్ లో జోష్ నింపింది. ఈ ప్రాజెక్ట్ తో మరో హిట్ కొట్టాలని బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. చూస్తుంటే సుడిగాలి సుధీర్ టాలీవుడ్ లో మాస్ హీరోగా ఎదగడం ఖాయమనిపిస్తుంది. ఇక సుధీర్ కెరీర్లో ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తిదాయకం. జబర్దస్త్ కి వచ్చే నాటికి సుధీర్ ఎవరో కూడా తెలియదు. వండర్స్ వేణు టీమ్ లో ఒక కమెడియన్ గా అతని ప్రస్థానం మొదలైంది. తన కామెడీ టైమింగ్ తో టీం లీడర్ అయ్యాడు.

తనకు రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను తోడు కావడం ప్లస్ అయ్యింది. జబర్దస్త్ వేదికగా ఈ ముగ్గురు మిత్రులు అద్భుతాలు చేశారు. సుడిగాలి సుధీర్ టీమ్ జబర్దస్త్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక డాన్స్ రియాలిటీ షో ఢీలోకి ఎంట్రీ ఇచ్చాక సుధీర్ ఫేమ్ మరింత పెరిగింది. సుధీర్ మల్టీ టాలెంటెడ్. ప్రొఫెషనల్ ఇంద్రజాలికుడు. బాగా పాడతాడు. డాన్స్ చేస్తాడు. తన టాలెంట్స్ బయటపెడుతూ బుల్లితెర స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు ఏకంగా వెండితెరపై గురి పెట్టి ముందుకు వెళుతున్నాడు.
— Sudigali Sudheer (@sudheeranand) March 22, 2023