Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష రెడ్ గౌనులో టెంపర్ లేపారు. హాట్ థైస్ చూపిస్తూ టెంప్ట్ చేశారు. వర్ష బోల్డ్ ఫోజులు చూసి నెటిజెన్స్ మైండ్ బ్లాక్ అయ్యింది. క్రేజీ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఒకప్పుడు పద్దతిగా ఫోటో షూట్స్ చేసిన వర్ష గ్లామర్ డోస్ డబుల్ చేశారు. చూస్తుంటే శ్రీముఖి, రష్మీ, అనసూయలను కూడా దాటేసే సూచనలు కనిపిస్తున్నాయి. పాపులారిటీ కోసం వర్ష తెగించి అందాల వడ్డించేస్తున్నారు.
వర్ష లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. వర్ష అనతి కాలంలో ఫేమ్ తెచ్చుకున్నారు. జబర్దస్త్ షోకి రావాలన్న నిర్ణయం ఆమె ఫేట్ మార్చేసింది. మొదట్లో వర్ష సీరియల్స్ లో నటించారు. చాలా కాలం సీరియల్ యాక్టర్ గా కొనసాగారు. కానీ ఆమెకు కనీస గుర్తింపు దక్కలేదు. ఈ క్రమంలో జబర్దస్త్ లేడీ కమెడియన్ గా కొత్త అవతారం ఎత్తారు.
జబర్దస్త్ షో ఎందరికో జీవితాలు ఇచ్చింది. వారిలో వర్ష కూడా ఒకరు. వర్ష గ్లామర్ జబర్దస్త్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మగాళ్ల లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన జబర్దస్త్ లవర్స్ కి వర్ష అందాలు ఉపశమనంలా తోచాయి. దాంతో ఆమె మాయలో పడిపోయారు. వర్షకు ఫేమ్ తెచ్చిపెట్టిన మరొక అంశం ఇమ్మానియేల్ తో లవ్ ఎఫైర్ రూమర్స్. ఆమె తనని తాను ఇమ్మానియేల్ లవర్ గా పరిచయం చేసుకున్నారు.
వర్ష-ఇమ్మానియేల్ బుల్లితెర లవ్ ట్రాక్ సక్సెస్ కాగా ఇద్దరిపై పలు స్కిట్స్, ఈవెంట్స్ రూపొందించారు. యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ అనంతరం ఆ స్థాయిలో సక్సెస్ అయిన బుల్లితెర ప్రేమికులుగా వర్ష-ఇమ్మానియేల్ నిలిచారు. వీరికి కూడా ఈటీవీలో ఉత్తుత్తి పెళ్లి జరిగింది. అయితే వీరి మధ్య ఉన్న నిజమైన బంధం ఏమిటనేది సస్పెన్సు.
షాకింగ్ మేటర్ ఏంటంటే కొందరు వర్షను లేడీ గెటప్ అంటారు. ఆమె అమ్మాయి కాదు అబ్బాయి అంటూ కామెంట్స్ చేస్తుంటారు. ఈ మాట అంటే వర్షకు నచ్చదు. ఒకసారి ఇమ్మానియేల్ మీద కూడా కోప్పడింది. వర్ష వాయిస్, లుక్ రీత్యా అబ్బాయి అంటూ ఎగతాళి చేస్తుంటారు. ఇక బుల్లితెర స్టార్ గా అవతరించిన ఈ చిన్నది దూసుకువెళుతున్నారు.