Homeట్రెండింగ్ న్యూస్Costliest Car Number: P7 నంబర్ కోసం ప్రపంచంలోనే అత్యధికంగా రూ.122 కోట్లు ఎందుకు పెట్టారు?

Costliest Car Number: P7 నంబర్ కోసం ప్రపంచంలోనే అత్యధికంగా రూ.122 కోట్లు ఎందుకు పెట్టారు?

Costliest Car Number
Costliest Car Number

Costliest Car Number: తాము వినియోగించే వాహనాలు, ఫోన్‌ నంబర్లు ఫ్యాన్సీగా ఉండాలని చాలా మంది అనుకుంటారు. కొంతమంది లక్కీ నంబర్‌ కావాలని కోరుకుంటారు. అయితే సంపన్నులు ఈ నంబర్ల కోసం లక్షలు, కోట్లు గుమ్మరిస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్‌ అధికారులు వాహనాల ఫ్యాన్సీ నంబర్లు వేలం వేస్తున్నారు. తాజాగా దుబాయ్‌కు చెందిన ఓ కారు నంబర్‌ ప్లేట్‌ అత్యధిక ధరకు అమ్ముడుపోయి కార్డు సృష్టించింది. ‘పీ7’ అనే కారు నంబర్‌ ప్లేటును రూ.122 కోట్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

రికార్డు ధరలు..
విభిన్నమైన వస్తువులు, ఖరీదైన వాహనాలు ఒక్కోసారి రికార్డు స్థాయి ధరలు పలుకుతూ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా ఈ తరహాలోనే ఓ కారు నంబర్‌ ప్లేట్‌ భారీ ధర పలికి ప్రపంచ రికార్డు సృష్టించింది. దుబాయ్‌కి చెందిన ఓ సంస్థ వేసిన వీఐపీ నంబర్‌ ప్లేట్ల వేలంలో ‘పీ7’ అనే కారు నంబర్‌ ప్లేట్‌ 55 మిలియన్‌ దిర్హామ్‌ (సుమారు రూ.122కోట్లు)లకు అమ్ముడు పోయింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన నంబర్‌ ప్లేట్లలో ఇదే అత్యధికం కావడం విశేషం.

పేదల ఆకలి తీర్చేందుకు..
ఖరీదైన కార్ల నంబర్‌ ప్లేట్లకు సంబంధించి దుబాయ్‌ రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ వేలం నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది పేదలకు ఆహారం అందించే బృహత్తర కార్యక్రమం కోసం దాదాపు 100 మిలియన్‌ ఏఈడీ(దిర్హామ్‌)లను సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో ఎమిరేట్స్‌ ఆక్షన్‌ పేరుతో దీన్ని రూపొందించారు. ఇందులో భాగంగా జుమైరాలోని ఫోర్‌ సీజన్స్‌ హోటల్‌లో వేలం నిర్వహించారు. దీన్ని యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ ప్రారంభించారు. ఇందులో ‘పీ7’ నంబర్‌ ప్లేట్‌ కోసం చాలామంది బిడ్డర్లు పోటీ పడ్డారు. చివరకు 55 మిలియన్‌ దిర్హామ్‌ల వద్ద ఓ వ్యక్తి ఈ నంబర్‌ ప్లేట్‌ను సొంతం చేసుకొని రికార్డు సృష్టించాడు.

Costliest Car Number
Costliest Car Number

ఈ నంబర్లకు కూడా భారీ ధర..
‘పీ7’ తరహాలోనే ‘ఏఏ22’ నంబర్‌ ప్లేట్‌ కూడా సుమారు రూ.18 కోట్లకు అమ్ముడుపోయింది. ఏఏ19కు సుమారు రూ.10 కోట్లుల ఖరీదు చేయగా.. హెచ్‌31, డబ్ల్యూ78, ఎన్‌41, ఎక్స్‌36, జెడ్‌37, ఏఏ80 నంబర్‌ ప్లేట్లు కూడా భారీ ధర పలికినట్లు వేలం నిర్వహించిన సంస్థ వెల్లడించింది. వీటితోపాటు కొన్ని మొబైల్‌ నంబర్లను కూడా వేలం ద్వారా విక్రయించారు. అయితే, కార్ల నంబర్‌ ప్లేటుకు సంబంధించి ఏఈడీ 52.5 మిలియన్లతో అబుదాబీ నంబర్‌ ‘ప్లేట్‌ 1’ సొంతం చేసుకున్న రికార్డును తాజాగా ‘పీ7’ నంబర్‌ తిరగరాసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version