https://oktelugu.com/

బిగ్ బాస్ ఎంట్రీతో అవినాష్ కు జబర్దస్ గేట్లు క్లోజ్..!

తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. కరోనా టైంలోనూ బిగ్ బాస్-4 బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ 9వ వారం కొనసాగుతోంది. బిగ్ బాస్ నుంచి ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు బయటికి వెళ్లడంతో గేమ్ ప్రస్తుతం రసవత్తరంగా మారుతోంది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ బిగ్ బాస్-4లోకి జబర్దస్త్ కామెడీయన్ అవినాష్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. అయితే నిన్నటి ఎపిసోడ్లో అవినాష్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 4, 2020 / 07:17 PM IST
    Follow us on

    తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. కరోనా టైంలోనూ బిగ్ బాస్-4 బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ 9వ వారం కొనసాగుతోంది. బిగ్ బాస్ నుంచి ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు బయటికి వెళ్లడంతో గేమ్ ప్రస్తుతం రసవత్తరంగా మారుతోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    బిగ్ బాస్-4లోకి జబర్దస్త్ కామెడీయన్ అవినాష్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. అయితే నిన్నటి ఎపిసోడ్లో అవినాష్ ఆ షో(జబర్దస్త్)లో మళ్లీ కన్పించేది లేదన్నాడు. తాను జబర్దస్త్ షో నుంచి బిగ్ బాస్ లోకి వచ్చానని.. అయితే ఇక్కడ ఇతర కంటెస్టెంట్లతో పడుతున్న అవమానాలు చాలా బాధకరంగా ఉన్నాయని కన్నీటి పర్యంతమయ్యాడు.

    Also Read: గుడ్ న్యూస్: మెగా డాటర్ పెళ్లి ఎప్పుడు? ఎక్కడంటే?

    బిగ్ బాస్ హౌస్ లో కామెడీ చేస్తూ అందరినీ అలరించే అవినాష్ ఒక్కసారిగా కన్నీటి పర్యంత అవడంతో అతడి స్నేహితులైన అరియానా.. ఇతర కంటెస్టెంట్లు అతడిని ఓదార్చే ప్రయత్నం చేశారు. కాగా రెండ్రోజులుగా జరిగిన నామినేషన్లు మాత్రం కంటెస్టుల మధ్య చిచ్చు పెట్టాయి. ఇప్పటివరకు గ్రూపులుగా ఉన్న కంటెస్టులు ఈ నామినేషన్ సందర్భంగా ఎవరికీ వారు దూరమైనట్లు కన్పించింది.

    Also Read: బోయపాటి దర్శకత్వంలో మరో వారసుడు !

    బిగ్ బాస్ లోకి అవినాష్ ఎంట్రీ ఇవ్వడానికి జబర్దస్త్ షో నిర్వాహాకులకు 10లక్షల జరిమానా చెల్లించినట్లు ప్రచారం జరిగింది. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు సైతం గతంలో జబర్దస్త్ పంచ్ వేశాడు. తాజాగా అవినాష్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇకపై జబర్దస్త్ లో అనినాష్ ఇకపై కన్పించకపోవచ్చని తెలుస్తోంది. అయితే జబర్దస్త్ ను వదిలేసి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అవినాష్ టైటిల్ గెలుస్తాడో లేదో వేచిచూడాల్సిందే..!