https://oktelugu.com/

గుడ్ న్యూస్: మెగా డాటర్ పెళ్లి ఎప్పుడు? ఎక్కడంటే?

మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం కొద్దిరోజుల క్రితం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. నాటి నుంచి నిహారిక పెళ్లి ఎప్పుడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా నిహారిక పెళ్లి డేట్ పై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. డిసెంబర్ 9న రాత్రి 7.15గంట‌ల‌కు పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. దీంతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ మెగాస్టార్ చిరంజీవి.. నాగబాబు ముద్దుల కుమార్తె నిహారికకు గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 4, 2020 / 06:52 PM IST
    Follow us on

    మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం కొద్దిరోజుల క్రితం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. నాటి నుంచి నిహారిక పెళ్లి ఎప్పుడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా నిహారిక పెళ్లి డేట్ పై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. డిసెంబర్ 9న రాత్రి 7.15గంట‌ల‌కు పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. దీంతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    మెగాస్టార్ చిరంజీవి.. నాగబాబు ముద్దుల కుమార్తె నిహారికకు గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో వివాహం ఖరారైంది. ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది. తాజాగా ప్రభాకర్ రావు దంపతులు కలియుగ శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిహారిక-చైతన్యల వివాహ పత్రికను స్వామివారి చెంత ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు.

    Also Read: బోయపాటి దర్శకత్వంలో మరో వారసుడు !

    శ్రీవారి దర్శనం అనంతరం ప్రభాకర్ రావు పెళ్లి డేట్ పై క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 9న రాత్రి 7.15నిమిషాలకు పెళ్లి ముహుర్తం ఖరారైందని తెలిపారు. వివాహా వేడుక రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఉదయపూర్‌లోని ఉదయ్ విలాస్‌ లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రాజ‌స్థాన్‌లో వివాహ వేడుక పెట్టడంపై అభిమానులు ఖంగుతిన్నారు.

    Also Read: మెగా న్యూస్: ‘ఆచార్య’ రీ షూటింగ్ ఎప్పుడంటే?

    పెళ్లి వేడుక రాజస్థాన్లో ఎందుకు పెట్టారనే చర్చ నడుస్తోంది. మెగా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. ఇక మెగా డాటర్ పెళ్లంటే ఇక మూములుగా ఉండదనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. పెళ్లికి ఇంకా నెలరోజుల సమయం ఉండగానే మెగా ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అయితే పెళ్లిపై వేడుక రాజస్థాన్లో పెట్టడంపై మెగా బ్రదర్ నాగబాబు అభిమానులకు ఎలాంటి క్లారిటీ ఇస్తారో వేచిచూడాల్సిందే..!