స్విట్జర్లాండ్‌లో చాక్లెట్ మంచు.. అసలు ఏమైందంటే?

స్విట్జర్లాండ్ లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అక్కడ చాక్లెట్ల తయారీకి వాడే కోకోబీన్స్(కోకోవా) మంచు రూపంలో కురిసింది. కోకో బీన్స్ మంచు రూపంలో కురవడం ఏంటని అవాక్కవుతున్నారా..? అందుకు ముఖ్య కారణమే ఉంది. ఆకాశంలో నుంచి ఉన్నపళంగా మంచు కింద పడటం చూసిన స్విస్ వాసులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలోని వెంటిలేషన్ వ్యవస్థలో లోపాల వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతమంతటా కోకోవా మంచు పడింది. జూరిస్, బాసెల్ […]

Written By: Kusuma Aggunna, Updated On : August 20, 2020 5:48 pm
Follow us on

స్విట్జర్లాండ్ లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అక్కడ చాక్లెట్ల తయారీకి వాడే కోకోబీన్స్(కోకోవా) మంచు రూపంలో కురిసింది. కోకో బీన్స్ మంచు రూపంలో కురవడం ఏంటని అవాక్కవుతున్నారా..? అందుకు ముఖ్య కారణమే ఉంది. ఆకాశంలో నుంచి ఉన్నపళంగా మంచు కింద పడటం చూసిన స్విస్ వాసులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలోని వెంటిలేషన్ వ్యవస్థలో లోపాల వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతమంతటా కోకోవా మంచు పడింది.

జూరిస్, బాసెల్ మధ్య ఓల్టెన్‌లోని ఫ్యాక్టరీలో కాల్చిన ‘కోకో నిబ్స్’ శీతలీకరణ వెంటిలేషన్‌లో చిన్న లోపం తలెత్తింది. ఫలితంగా బలమైన గాలులతో కలిసి సమీప ప్రాంతాలలో కోకో పౌడర్ శరవేగంగా వ్యాపించింది. లిండ్ట్ అండ్‌ స్ప్రూయంగ్లీ సంస్థ ఈ విషయాలను అధికారికంగా ధృవీకరించింది. వెంటిలేషన్ వ్యవస్థలోని చిన్నచిన్న లోపాలే కోకోవా వ్యాప్తికి కారణమని తేలింది.

బలమైన గాలులతో కలిసిన కోకో పౌడర్ ఒక కారుపై పూతలా ఏర్పడింది. ఈ విషయం తెలిసిన సంస్థ సదరు కారును పూర్తిగా తామే బాగు చేయిస్తామని తెలిపింది. గాలిలో కలిసిన కోకో కణాల వల్ల ప్రజలకు, పర్యావరణానికి పెద్దగా హాని కలగదని పేర్కొంది. విషయం తెలిసిన వెంటనే వెంటిలేషన్ వ్యవస్థను బాగు చేయించామని ప్రస్తుతం ఎటువంటి సమస్య లేదని తెలిపింది. మనం తినే చాక్లెట్లలో కోకోవా కనీసం 60 శాతం ఉంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కోకోవా చాక్లెట్లను తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.