హీరోల ఇగోలను సంతృప్తి పరుస్తారా..!

క‌రోనా మ‌హ‌మ్మారి వల్ల అన్ని రంగాల వారి కంటే కూడా.. ఎక్కువగా ఇబ్బందులు పడింది సినిమా వాళ్లే. కరోనా కాలంలో సినీ ప్ర‌పంచం మొత్తం అత‌లాకుత‌ల‌మైపోయింది. అయితే మొత్తానికి కరోనాకి సినిమా వాళ్ళు అలవాటు పడుతున్నారు. లాక్‌డౌన్ తో ఆపేసిన సినిమాల షూటింగ్స్ మళ్లీ మొదలు పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. కరోనా ప్రభావం ఇంకా ఉన్నా.. షూటింగ్ ల ప్లాన్స్ మాత్రం తగ్గడం లేదు. సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో క్లారిటీ లేకపోయినా.. ఏ సినిమా రిలీజ్ […]

Written By: admin, Updated On : August 20, 2020 5:52 pm
Follow us on


క‌రోనా మ‌హ‌మ్మారి వల్ల అన్ని రంగాల వారి కంటే కూడా.. ఎక్కువగా ఇబ్బందులు పడింది సినిమా వాళ్లే. కరోనా కాలంలో సినీ ప్ర‌పంచం మొత్తం అత‌లాకుత‌ల‌మైపోయింది. అయితే మొత్తానికి కరోనాకి సినిమా వాళ్ళు అలవాటు పడుతున్నారు. లాక్‌డౌన్ తో ఆపేసిన సినిమాల షూటింగ్స్ మళ్లీ మొదలు పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. కరోనా ప్రభావం ఇంకా ఉన్నా.. షూటింగ్ ల ప్లాన్స్ మాత్రం తగ్గడం లేదు. సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో క్లారిటీ లేకపోయినా.. ఏ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో ఇంకా తెలియకపోయినా.. షూటింగ్స్ మాత్రం చకచకా చేసేందుకు మేకర్స్ సన్నద్ధం అవుతున్నారు.

Also Read: విజయ్ – మురుగదాస్‌ నాలుగోసారి..

షూటింగ్ లు పూర్తి అయితే.. ఇక నాలుగు నెలల్లో దర్శకనిర్మాతలు పక్కా ప్లానింగ్ తో రిలీజ్ డేట్స్ ను సెట్ చేసుకుంటారట. అందరూ కలిసి తమ సినిమాల మార్కెట్ రేంజ్ ను బట్టి సినిమాల మధ్య పోటీ లేకుండా రిలీజ్ డేట్స్ ప్రకటిస్తారట. ఆ దిశగా ముందుకు వెల్లలని నిర్మాతలు ప్లాన్ చేసుకున్నా.. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే హీరోల ఇగోలను సంతృప్తి పరచడం అంత తేలిక కాదు. గత సంక్రాంతి సీజన్ లో హీరోలు ఒకరి పై ఒకరు పోటీ పడిన విధానం మనకు తెలియనది కాదు.

Also Read: నిర్మాత లాభం కోసం.. ప్రభాస్ రిస్క్ !

మరి హీరోలను నిర్మాతలు ఎలా మ్యానేజ్ చేస్తారు అన్నదే ఇక్కడ మరొక పెద్ద సమస్య. దీనికి తోడు కరోనా వల్ల సమ్మర్ లో రావాల్సిన సినిమాలన్ని పోస్ట్ ఫోన్ అవ్వక తప్పలేదు. ముఖ్యంగా నిశ్శబ్దం, రెడ్, మాస్టర్ (తమిళ డబ్), ‘వి’, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, ఒరేయ్ బుజ్జిగా, ఉప్పెన లాంటి సినిమాలకు మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలు కూడా ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్నాయి. మరి ఇలాంటి మిడియమ్ రేంజ్ సినిమాలకు సోలో రిలీజ్ దొరికే అవకాశం ఉండదు. ఈ సినిమాలు మాత్రం డైరెక్ట్ థియేటర్ రిలీజ్ కోసమే ఎదురుచూస్తూ.. ఓటిటి ఆఫర్స్ ను కూడా కాదనుకుంటున్నాయి. ఇప్పుడు నిర్మాతలకు ఉన్న ఏకైక మార్గం.. హీరోల ఇగోలను సంతృప్తి పరచాలి. మరి పరుస్తారా.. !