
Orange Re Release: మరో రెండు రోజుల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు రాబోతుంది. ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఆయన పుట్టినరోజు ని ఘనంగా జరిపించబోతున్నారు ఫ్యాన్స్, అయితే ఈ ఏడాది మరింత రెట్టింపు ఉత్సాహం తో జరపబోతున్నారు. అందుకు కారణం అందరికీ తెలిసిందే, ఆయన నటించిన #RRR చిత్రానికి ఆస్కార్ అవార్డు రావడం తో పాటుగా, ఏ హీరో కి దక్కనంత గ్లోబల్ ఇమేజి దక్కడం.
అయితే ఈమధ్య స్టార్ హీరోల హిట్ సినిమాలను పుట్టినరోజు కానుకలుగా రీ రిలీజ్ చేసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అలా రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ‘మగధీర’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసి సంబరాలు చేసుకుందాం అనుకున్నారు. కానీ మధ్యలో ట్విస్టు గా రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఒకటిగా నిల్చిన ‘ఆరెంజ్’ మూవీ ని రీ రిలీజ్ చేయబోతున్నట్టు ఒక ప్రకటన విడుదల చేసారు.
అలా మగధీర సినిమాని ఆపించి ‘ఆరెంజ్’ సినిమాని రీ రిలీజ్ చెయ్యాలనే ఆలోచన నాగబాబుదే అట. ఎందుకంటే మగధీర సినిమా రీ రిలీజ్ చేస్తే దానికి వచ్చిన డబ్బులు మొత్తం గీత ఆర్ట్స్ కి పోతుంది. అదే ‘ఆరెంజ్’ సినిమా విడుదల చేస్తే అది తన సొంత సినిమానే కాబట్టి వచ్చిన కలెక్షన్స్ మొత్తం జనసేన పార్టీకే డొనేట్ చేస్తానని నాగబాబు చెప్పాడు. అందుకే ఆరెంజ్ చిత్రం తెరమీదకి వచ్చింది.

ఈ సినిమా రీ రిలీజ్ చేస్తే ఎవడు చూస్తాడు, అప్పట్లోనే ఎవ్వరూ చూడలేదు అని అందరూ అనుకున్నారు, కానీ ఈ సినిమాకి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తూ ఉంటే ఫ్యాన్స్ కి సైతం మైండ్ బ్లాక్ అవుతుంది.ఎందుకంటే ఒక డిజాస్టర్ ఫ్లాప్ సినిమాని రీ రిలీజ్ చేస్తే ఇంత రెస్పాన్స్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం నడుస్తున్న బుకింగ్స్ ట్రెండ్ చూస్తూ ఉంటే ఈ సినిమా కచ్చితంగా రెండు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్.