spot_img
Homeట్రెండింగ్ న్యూస్Umang App: ఈ ఒక్క యాప్ తో అన్ని ప్రభుత్వ సేవలు మీరు ఈజీగా వాడుకోవచ్చు

Umang App: ఈ ఒక్క యాప్ తో అన్ని ప్రభుత్వ సేవలు మీరు ఈజీగా వాడుకోవచ్చు

Umang App: సాధారణంగా ప్రభుత్వ సేవలను పొందాలనుకుంటే.. అందుకోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. పనులన్నింటినీ పక్కన పెట్టి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లిన ఆ రోజు అధికారులు అందుబాటులో లేకపోతే పని జరిగేది కాదు. దీంతో ఏదైనా ఒక పని పూర్తి కావాలంటే కనీసం రెండు, మూడు రోజులు పట్టేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో ఏ పని అయినా నిమిషాల్లో చేసుకునే వెసులుబాటు వచ్చింది.

ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింతగా చేరువ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త యాప్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఆ యాప్ పేరు ‘ ఉమాంగ్ (UMANG). అంతేకాదు అందరికీ ఉపయోగపడాలని మొత్తం 13 స్థానిక భాషల్లో ఈ యాప్ ను వినియోగంలోకి తీసుకువచ్చింది. అయితే ఈ యాప్ ఏంటి? ఎందుకు ఉపయోగపడుతుందనే విషయాలను మనం తెలుసుకుందాం.

ఉమాంగ్ అంటే యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్ (UMANG – Unified Mobile Application for New-age Governance). ఈ యాప్ ద్వారా కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సేవలన్నీ ఒకే ప్లాట్ ఫామ్ పై అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ సేవల కోసం రకరకాల యాప్ లను ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకుని ఇబ్బందులు పడే బదులు ఈ ఒక్క యాప్ తో అన్ని రకాల ప్రభుత్వ సేవలను పొందవచ్చు.

ఇందుకోసం ముందుగా మొబైల్ లోని గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. తరువాత పేరు, మొబైల్ నంబర్, వయసు వంటి వ్యక్తిగత వివరాలతో ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకోవాలి. ఆ తరువాత ప్రొఫైల్ ఫొటోను అప్ లోడ్ చేసుకోవాలి. ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తరువాత లాగిన్ అయి సేవలన పొందడానికి Sort & Filter విభాగానికి వెళ్లాలి. అనంతరం కావాల్సిన సేవల కోసం ‘search option’ కి వెళ్లాలి. అలాగే ఆధార్ నంబర్ ను యాప్ తో పాటు ఇతర సోషల్ మీడియా ఖాతాలకు కూడా లింక్ చేసుకునే అవకాశం ఉంది.

కాగా ఈ ఉమాంగ్ యాప్ ద్వారా.. ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సేవలు, గ్యాస్​సిలిండర్ , పాన్ కార్డు, ఆదాయపు పన్ను, పాస్‌పోర్ట్ సేవలు పొందడంతో పాటు యుటిలిటీ బిల్లు పేమెంట్లను చేసుకోవచ్చు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, జీఎస్టీ, పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ లాంటి సేవలు పొందవచ్చు. వ్యవసాయ సలహా సేవలు, ఆన్‌లైన్ జాబ్ అప్లికేషన్ సిస్టమ్, సాయిల్ హెల్త్ కార్డ్, సుఖద్ యాత్ర , పెన్షన్ పోర్టల్ వంటి పలు సేవలను ఈ యాప్ ద్వారా పొందే అవకాశం ఉంది.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version