https://oktelugu.com/

Anchor Lasya: యాంకర్ లాస్యను ఘోరంగా కొట్టిన భర్త… కారణం ఇదే! వైరల్ వీడియో

లాస్య బిగ్ బాస్ హౌస్లో వంటలక్కగా వ్యవహరించింది, ఇంటి సభ్యులందరికీ భోజనం చేసి పెట్టేది. అయితే ఒకసారి ఈమె చేసిన పప్పు తిని అందరికీ విరోచనాలు అయ్యాయి.

Written By:
  • Gopi
  • , Updated On : February 8, 2024 / 01:20 PM IST
    Follow us on

    Anchor Lasya: యాంకర్ లాస్యను భర్త ఘోరంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లాస్య పరిచయం అక్కర్లేని పేరు. ఈమె గతంలో పలు షోలకు యాంకరింగ్ చేసింది. ఒకప్పుడు యాంకర్ గా అమ్మడుకి మంచి క్రేజ్ ఉండేది. సడన్ గా ఆమె యాంకరింగ్ కి దూరమైంది. బిగ్ బాస్ తెలుగు 4లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మరలా వెలుగులోకి వచ్చింది. హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా లాస్య చాలా వారాలు ఉన్నారు. అయితే ఫైనల్ కి వెళ్లలేకపోయింది.

    లాస్య బిగ్ బాస్ హౌస్లో వంటలక్కగా వ్యవహరించింది, ఇంటి సభ్యులందరికీ భోజనం చేసి పెట్టేది. అయితే ఒకసారి ఈమె చేసిన పప్పు తిని అందరికీ విరోచనాలు అయ్యాయి. ఆ విషయంలో హోస్ట్ నాగార్జున కూడా లాస్యను ఆటపట్టించాడు. బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చాక లాస్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంది. యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ లో రీల్స్, వీడియోలు చేస్తూ ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది.

    కాగా లాస్యను భర్త మంజునాథ్ కొట్టాడు. కుర్చీ ఎత్తి పట్టుకుని ఆమెపై విరుచుకుపడ్డాడు. అసలు లాస్యను భర్త ఎందుకు కొట్టాల్సి వచ్చింది? వాళ్ళ మధ్య గొడవేంటి? అంటే… ఇదంతా సరదాలో భాగమే. తెలుగు రాష్ట్రాల్లో కుమారి ఆంటీ లేటెస్ట్ సెన్సేషన్. ఆమె వీడియోలు, రీల్స్ తెగ హల్చల్ చేస్తున్నాయి. ‘మీది మొత్తము థౌసండ్ అయ్యింది. రెండు లివర్లు ఎక్స్ట్రా’ అనే రీల్ బాగా వైరల్ అవుతుంది. ఈ రీల్ ని లాస్య తన భర్తతో చేసింది.

    చేపల కూర వడ్డించి డబ్బులు అడగడంతో.. కోప్పడ్డ మంజునాథ్ లాస్య మీదకు కుర్చీ ఎత్తాడు. ఈ రీల్ ని లాస్య తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. అదన్నమాట సంగతి. మంజునాథ్ ని లాస్య ప్రేమ వివాహం చేసుకుంది. లాస్య తండ్రి కొన్నాళ్ళు వీరిని బహిష్కరించారట. కొడుకు పుట్టాక దగ్గరకు తీశాడని బిగ్ బాస్ హౌస్లో చెప్పుకొచ్చింది. లాస్యకు ఇద్దరు కుమారులు.