Swargaseema Chandrasekhar: ఏదైనా వస్తువు జనాల్లోకి వెళ్లాలంటే పబ్లిసిటీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎంత ఎక్కువ పబ్లిసిటీ చేస్తే అంత లాభం. కానీ పబ్లిసిటీ ఎంత బాగుంటే.. వారు చెప్పే వస్తువు కానీ చెప్పాలనుకున్న పాయింట్ కానీ ఎక్కువ రీచ్ అవుతుంది. అందుకే చాలా సంస్థలు టీవీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ చేస్తున్నారు. కొందరి గురించి, కొన్ని ప్రాడెక్ట్స్ గురించి ప్రజలకు తెలిసినా.. వీరి పబ్లిసిటీ వల్ల మరింత దగ్గరవుతారు.
కొన్ని సంస్థలు ఏకంగా సెలబ్రెటీలను వారి బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్లను చేసుకుంటారు. వారి వల్ల బ్రాండ్ ప్రమోషన్ లు చేయిస్తుంటారు. కానీ కొందరు వారి ప్రాడెక్ట్స్ కు వారే ప్రమోట్ చేస్తుంటారు. ఇలాంటి వారిలో లలితా జ్యువెలరీ ఓనర్ ఒకరు. కిరణ్ కుమార్ తమ నగల గురించి ఆయన చెబుతూ.. కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. నగలు ఎలా తయారు చేస్తారు? ఎలాంటి స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి? అనే వివరాలను క్లియర్ గా చెప్తారు.
లెజెండ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శరవణన్ కూడా శరవణ స్టోర్స్ ఓనర్. ఈయన కూడా తన వ్యాపారాలను తానే ప్రమోట్ చేసుకుంటారు. ఇలా చాలా మంది తమ ఉత్పత్తులను తామే ప్రమోట్ చేసుకుంటారు. ఇదే క్రమంలో తన కన్ స్ట్రక్షన్ వ్యాపారాన్ని ప్రమోట్ చేస్తూ వైరల్ అయ్యారు ఓ వ్యక్తి. ఆయన ఎవరో కాదు చంద్ర శేఖర్. స్వర్గసీమ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా చేస్తూనే తమ వ్యాపార వివరాలను ప్రమోట్ చేస్తుంటారు. రీసెంట్ గా స్వర్గసీమ శాండల్ వుడ్ ఫార్మ్స్ కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
టీవీలో డిఫరెంట్ గెటప్స్ లో యాడ్స్ చేస్తూ తమ శాండల్ వుడ్ ఫార్మ్స్ గురించి వివరిస్తున్నారు చంద్ర చంద్రశేఖర్. ఈయన వ్యాపారవేత్త మాత్రమే కాదట.. మంచి కౌన్సిలర్ కూడా అని తెలుస్తోంది. వ్యక్తిత్వ వికాసానికి చెందిన ఎన్నో విషయాలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చెబుతూ మోటివేట్ చేస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా? ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి? రిలేషన్ షిప్స్, వ్యాపారాలకు సంబంధించిన విషయాలు వంటి వాటిమీద వీడియోలు పెడుతుంటారు.