BJP TDP Alliance: రాజమండ్రి నుంచి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత.. చంద్రబాబు ముఖంలో నవ్వు.. జగన్మోహన్ రెడ్డిని తిట్టి అలసిపోయిన తర్వాత కొంచెం సాంత్వన.. ఏపీలో తిరిగి తిరిగి ఆయనకు ఒకింత రిలీఫ్.. ఇంతకీ ఏమిటయ్యా అంటే.. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరుగుతోంది.. మీరు రండి అంటూ చంద్రబాబు నాయుడికి రామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానం పలికింది కదా.. ఆ సంస్థ ప్రతినిధులు చంద్రబాబు నాయుడుకి ఆహ్వానం పత్రిక అందించారు కదా.. దీనిని పచ్చ మీడియా గొప్పగా రాసుకొచ్చింది కదా.. ఏమోయ్ జగనూ చూశావా మా బాబు గారి గొప్పతనం.. నువ్వు మోడీ మోడీ అని పొగుడుతుంటావు కానీ అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావాలని మా చంద్రబాబుకే ఆహ్వానం అందించారు తెలుసా అంటూ ఆంధ్ర జ్యోతి, ఈనాడు తెగ మురిసిపోయాయి. మైమరచి రాసుకుంటూ పోయాయి. ఆహ్వానం అందిందే తడవు రెండో మాటకు తావు లేకుండా.. ఎక్కడ పొత్తు బెడిసి కొడుతుందని భయంతో.. చంద్రబాబు ఫ్లైట్ కట్టించుకుని అయోధ్య వెళ్లిపోయాడు.
అంతే తనకు తెలిసిన బిజెపిలోని కొంతమంది పెద్దలతో కలిసిపోయాడు. నవ్వుతూ మాట్లాడాడు. చేతులు జోడించి నమస్కరించాడు. రాజమండ్రి ఎపిసోడ్.. స్కిల్ డెవలప్మెంట్ కేసు.. చంద్రబాబు నాయుడుకి బాగానే ఇబ్బందులు కలగజేసాయి కావచ్చు.. అనవసర డాంబికానికి పోకుండా తగ్గి ఉన్నాడు. తప్పదు అనుకున్నాడు. ఎప్పుడైతే ఆ ఫోటోలు బయటకు వచ్చాయో పచ్చ మీడియా రకరకాల ప్రచారాలు చేయడం మొదలుపెట్టింది. ఒకవైపు రాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట లైవ్ నడుస్తుండగానే.. బిజెపి చంద్రబాబు నాయుడు ని దగ్గరికి పిలిపించుకుంది. పొత్తుకు ఓకేనా బాబూ రిక్వెస్ట్ చేసింది. నువ్వు ఎన్ని సీట్లు ఇచ్చినా పర్వాలేదు నీతో పొత్తు కుదురుచుకోవడమే మా మహాభాగ్యం అంటూ కాళ్ళా వేళ్ళా పడి బతిమిలాడింది అంటూ కలరింగ్ ఇచ్చింది. నీ వాస్తవానికి చంద్రబాబు నాయుడిని బిజెపిలో పెద్ద తలకాయలు ఏమీ కలవలేదు. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. నరేంద్ర మోడీ రాముడి సేవలో ఉన్నాడు. యూపీ యోగి భద్రత పర్యవేక్షిస్తూ ఉన్నాడు. కేంద్ర మంత్రులు వచ్చి పోయే అతిధులను ఓ కంట కనిపెడుతున్నారు. చివరికి చంద్రబాబు కలిసింది ఎవరయ్యా అంటే హర్యానా ముఖ్యమంత్రిని, మరో బిజెపి నాయకుడిని..
కానీ ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే.. చంద్రబాబు నాయుడు అన్న మాటలను బిజెపి క్షమించిందా? తన బ్లడ్ బ్రీడ్ బావమరిది తిట్టిన తిట్లను మర్చిపోయిందా? లేకుంటే ఆ జగన్ తో స్నేహం చెడిపోయిందా? చంద్రబాబు నాయుడే మనకు మంచి మిత్రుడు అనే అభిప్రాయం ఆ పార్టీలో మళ్లీ మొదలైందా? ఈ ప్రశ్నలకు పచ్చ మీడియా అవును అని సమాధానం చెప్పొచ్చు. బాబు గారు గొప్పోరు అని కీర్తించవచ్చు. కానీ మోడీ మదిలో ఏముందో ఎవరికి ఎరుక..