
PM Modi Special Story: నరేంద్ర మోదీ.. బహుశా ఈ పేరు కొంతమంది నచ్చకపోవచ్చు, మరి కొంతమందికి నచ్చవచ్చు. కానీ ప్రస్తావనకు రాకుండా మాత్రం ఉండదు. అంతగా ప్రభావం చూపించాడు మరి.. నచ్చినవాళ్లు హరహర మోదీ ఘర్ ఘర్ మోదీ అంటే.. నచ్చని వాళ్ళు “దేశంలో దొంగల ఇంటి పేర్ల చివర మోదీ అని ఎందుకు ఉంటుంది” అని తలతిక్క వ్యాఖ్యలు చేస్తుంటారు.. చివరకు పార్లమెంటు నుంచి నిషేధం ఎదర్కొంటారు. కానీ వీటన్నింటిని మోదీ ఎన్నడూ లెక్కలోకి తీసుకున్న దాఖలాలు లేవు. తన పని తాను చేసుకుంటూ వెళుతుంటాడు. వెన్నుపోటు ద్వారా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి తనకు తాను వర్క్ హాలిక్ చెప్పుకొని, సొంత మీడియాలో 18 గంటలు పని చేసే వ్యక్తిగా రాయించుకున్న ఈ దేశంలో.. మోదీ తనను వర్క్ హాలిక్ గా చెప్పుకోడు. ఆయన గురించి ఏ మీడియా రాయదు. కమ్మీ మీడియా, కాంగీ మీడియా, ఎల్లో మీడియా, నీలి మీడియా, పచ్చ మీడియా.. ఇలా ఏది చూసుకున్నా.. మోదీకి వ్యతిరేకమే. చివరికి మోదీ ధరించే దుస్తులు, పెట్టుకునే కళ్ళజోడు, టోపీ, రాసే పెన్ను, తినే తిండి మీద కూడా విమర్శలు చేసే ప్రతిపక్షాలు ఉన్నాయి మన దేశంలో.. అదే చైనా లేదా మరే ఇతర దేశాల్లో అయితే ప్రతిపక్షాలు ఇలా వ్యవహరిస్తుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది.
సాధారణంగా మోదీ శివ భక్తుడు, అమ్మవారికి ఉపాసకుడు. అత్యంత దుర్భేద్యమైన వాతావరణం ఉండే కేదార్ నాథ్ కు దట్టంగా కురిసే మంచులో వెళ్ళాడు. శివుడు చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. అంతే కాదు కేదార్ నాధ్ లో ఎటువంటి ఆలనా పాలన లేని కేదారేశ్వరుడికి, నిర్లక్ష్యానికి గురైన ఆయన ఆలయానికి ఒక కొత్త రూపు కల్పించాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ పరమశివ క్షేత్రాన్ని అభివృద్ధి చేశాడు. కాశీ విశ్వేశ్వరుడికి, ఉజ్జయిని మహాకాళుడికి విశాలమైన ఆలయ యోగం కల్పించిన ఘనత మోదీకే దక్కుతుంది. అంతేకాదు అయోధ్య రామ మందిర వివాదం త్వరగా సమసి పోవడానికి కారణం కూడా మోదీనే అనడంలో అతిశయోక్తి కాక మానదు.. సాధారణంగా ఎవరైనా హిమాలయాలకు వెళితే అక్కడి వాతావరణం వల్ల అనారోగ్యానికి గురవుతారు.. కానీ మోదీకి ఎన్నడూ అలాంటి ఎదురు కాలేదు..ఆయన ఎప్పుడూ శివ ధ్యాన ముద్రలో ఉంటారని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతుంటాయి. సాక్షాత్తు పరమశివ భక్తుడు కాబట్టే ” కాశీ స్వయం ప్రకాశి” అనే నినాదం ఆయన నోటి నుంచి ఆశువుగా వచ్చేసింది. మోదీ ఎక్కడికి వెళ్ళినా అక్కడి ఆలయాల్లో పూజలు చేస్తూ ఉంటారు. ఆయనకు హిమాలయాలకు దగ్గర సంబంధం ఉన్నట్టుంది. అందుకే 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత నేరుగా హిమాలయాలకు వెళ్లిపోయాడు. బహుశా మోదీ చివరి గమ్యస్థానం అదే కాబోలు.

మోదీ శివ భక్తుడే కాదు..జంతు ప్రేమికుడు కూడా.. జంతువులను కెమెరాలో బంధించడం మోదీకి అమితమైన ఇష్టం.. అందుకే ఆయన ఏ అడవికి వెళ్ళినా అక్కడి జంతువులను చూస్తూ సంబర పడతారు..వాటిని తన కెమెరాలో బంధిస్తారు. ఆ మధ్య సెప్టెంబరు లో తన జన్మదినోత్సవం సందర్భంగా నమీబియా నుంచి చీతాలను తెప్పించారు. వాటిని మధ్య ప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో వదిలారు. గతంలో అనేక ప్రభుత్వాలు వాటిని ఇండియాకి తీసుకురావాలని ప్రయత్నించాయి. కానీ అది మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే సాధ్యపడింది. అంతేకాదు అడవుల్లో పులుల సంరక్షణ కోసం ప్రాజెక్ట్ టైగర్ అనే కార్యక్రమాన్ని కేంద్రం చేపడుతోంది. నరేంద్ర మోదీ హయాంలో తీసుకున్న చర్యల వల్ల దేశంలో పెద్దపులుల సంఖ్య 3,167 కు పెరిగింది. ఇక నరేంద్ర మోదీ మొన్న సికింద్రాబాద్ పర్యటన ముగించుకుని నేరుగా ఆయన కర్ణాటక వెళ్లారు. బండిపుర అడవికి వెళ్లారు.. సుమారు 20 కిలోమీటర్లు ఓపెన్ సఫారీలో పర్యటించారు.. అంతేకాదు పెద్దపులి, చిరుత, సింహం, మంచు చిరుత, చీతా, ప్యూమ, జాగ్వార్ ఇలాంటి ఏడు క్రూర జంతువుల సంరక్షణ కోసం “ఇంటర్నేషనల్ బిగ్ కేట్ అలయన్స్” అనే కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు.. వచ్చే 25 సంవత్సరాల్లో పెద్ద పూలుల సంరక్షణకు చేపట్టే కార్యాచరణ పై “అమృత్ కాల్ కా టైగర్ విజన్ ” పేరిట రాసిన బుక్ లేట్ ను ఆయన ఆవిష్కరించారు. పులుల సంతతికి సంబంధించిన నివేదికను, ప్రత్యేక నాణేన్ని కూడా ఆయన విడుదల చేశారు.

ఇక కేవలం మనదేశంలోనే కాదు విదేశాల్లో కూడా మోదీకి విపరీతమైన ఆదరణ ఉంది.. అమెరికా నుంచి జర్మనీ దాకా ప్రధానమంత్రి ఎక్కడికి వెళ్ళినా అక్కడి ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతుంటారు.. చిన్న చిన్న పిల్లలు కూడా మోదీకి అభిమానులు అంటే అతిశయోక్తి కాదు.. ఆయనపై ప్రత్యేకంగా రూపొందించిన గ్రీటింగ్ కార్డులను ప్రధానికి బహూకరిస్తుంటారు. తనని కలిసి చిన్నారులను మోదీ ముద్దు చేస్తుంటారు. విదేశాలకు వెళ్లినప్పటికీ మోదీ తన భారతీయతను మర్చి పోరు. ఆహార్యం విషయంలో భారతీయతను ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ మధ్య హౌడి మోడీ కార్యక్రమానికి మోదీ అమెరికా వెళితే లక్షల మంది జనం వచ్చారు. ఆ జనాన్ని చూసిన అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో దుర్గాదేవి నవరాత్రులు జరుగుతున్నాయి. అంతటి సమావేశంలో కూడా మోదీ అమ్మవారికి ఉపవాసం ఉన్నారు. కేవలం గోరువెచ్చని నిమ్మకాయ నీరు మాత్రమే తాగారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన నాన్ వెజ్ తినరు. విదేశీ వంటకాలను ముట్టుకోరు. పైగా దౌత్య విధానంలో మోదీకే మోదే సాటి. అందుకే అమెరికాను ధిక్కరించి రూపాయి లోనే ట్రేడింగ్ జరిపేలా చర్యలు తీసుకున్నారు. డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం లో న్యూట్రల్ గా ఉండి, రష్యా నుంచి ముడి చమురును భారత్ రుపాయిల్లో కొనుగోలు చేయడం మోదీ దౌత్య విధానానికి ఒక మచ్చుతునక. ఆ మధ్య నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు సౌదీ అరేబియా నిరసన వ్యక్తం చేసింది. తర్వాత ఒక్క రోజులోనే ఇది సమసిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే మోదీ సాధించిన ఘనతలు ఎన్నో..అందుకే మోదీ ఒక ప్రధాని మాత్రమే కాదు..భారత దేశానికి ఒక బ్రాండ్ కూడా.