
Bigg Boss Harika: బిగ్ బాస్ వేదికగా వెలుగులోకి వచ్చింది అలేఖ్య హారిక. ఒకప్పటి ఈ యూట్యూబర్ హౌస్ షేక్ చేసింది. దేత్తడి హారికగా ఆమె ఫేమస్. పలు షార్ట్ ఫిల్మ్ లో నటించింది. తెలంగాణా యాక్సెంట్లో రౌడీ పిల్లగా ఆమె నటన బాగుంటుంది. దేత్తడి హారిక పలు యూట్యూబ్ వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ దెబ్బతో సోషల్ మీడియా సెలబ్రెటీగా అవతరించింది. ఆ పాపులారిటీతో బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ దక్కించుకుంది.
బిగ్ బాస్ సీజన్ 4లో హారిక పాల్గొన్నారు. హౌస్లో తన మార్కు గేమ్ తో ఆకట్టుకున్నారు. స్ట్రాంగ్ గర్ల్ గా అవతరించిన హారిక ఓ ఛాలెంజ్ లో భాగంగా జుట్టు కట్టించుకోవడం విశేషం. భుజాల వరకు ఆమె జుట్టు కత్తిరించారు. ఇక పొట్టి బట్టల్లో గ్లామర్ షో కూడా చేసింది. గేమ్స్ లో హారిక గట్టిగా పోరాడేది. అబ్బాయిలకు పోటీ ఇచ్చేది.
ఎఫైర్స్ కూడా నడపడం కొసమెరుపు. అభిజీత్ తో హారిక సన్నిహితంగా ఉన్నారు. అతనితో రొమాన్స్ చేశారు. అభిజీత్ కంటెస్టెంట్ మోనాల్ కోసం గట్టిగా ట్రై చేశాడు. ఆమె అఖిల్ కి దగ్గర కావడంతో అభిజీత్ కి వర్క్ అవుట్ కాలేదు. దాంతో హారికతో సరిపెట్టుకున్నాడు. హారిక మాత్రం అభిజీత్ ని సీరియస్ గా లవ్ చేసింది. ఈ జంటకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఏర్పడ్డారు. అభిజీత్-హారికలను ప్రమోట్ చేశారు.

అభిజీత్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. హారిక ఫైనల్ కి వెళ్ళింది. అయితే ఆమెకు 5వ స్థానం దక్కింది. షో నుండి బయటకు వచ్చాక అభిజీత్ ఆమెకు భారీ షాక్ ఇచ్చాడు. హారిక నాకు చెల్లితో సమానం. ఆ దృష్టితోనే ఆమెకు క్లోజ్ గా ఉన్నానని చెప్పాడు. ఆ దెబ్బతో హారిక మైండ్ బ్లాక్ అయ్యింది. బిగ్ బాస్ షో ముగిశాక వీరు సన్నిహితంగా ఉన్న దాఖలాలు లేవు.
ప్రస్తుతం హారిక వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తుంది. హీరోయిన్ కావడమే తన లక్ష్యమని హారిక గతంలో చెప్పారు. మరో వైపు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. తాజాగా నైట్ వేర్లో హాట్ ఫోటో షూట్ చేసింది. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ఫ్యాన్స్ క్రేజీగా ఫీలవుతున్నారు.