
Iratta Movie: కోవిడ్ తర్వాత.. ఓటీటీలు మనకు మరింత చేరువైన తర్వాత.. మలయాళీ సినిమాలు మనవాళ్లకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. డిఫరెంట్ కథ, అన్నింటికీ మించిన కథనం, స్క్రీన్ ప్లే.. మన వాళ్లను ఎంగేజింగ్ చేస్తున్నాయి. అలా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ఇరట్టా అనే ఒక మలయాళీ సినిమా విడుదలైంది.. తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా ఇప్పుడు మనవాళ్లను తెగ భయపడుతోంది. ఒకకరంగా చెప్పాలంటే మైండ్ ఖరాబ్ చేస్తోంది. ఈ సినిమాను మామూలు ప్రేక్షకులు చూసి తట్టుకోవడం కొంత కష్టమే. మనసులోని పశు ప్రవృత్తి, డిస్టర్బ్ చైల్డ్ తీరు, పోలీసుల వ్యవహారం.. ఇలా ఈ మూడు కోణాల్లో ఈ సినిమా సాగుతుంది. చూసే ప్రేక్షకులను మరింత భయపెడుతుంది.
వాస్తవంగా సినిమాల్లో పశు ప్రవృత్తి గురించి చూపించడం కొత్తేమి కాదు. ఇరట్టా సినిమాలో జోజూ జార్జీ చేసిన రెండు పాత్రలూ పశువుల్లాగానే ఉంటాయి. పైకి హీరో, లోపల విలన్ అనుకోవచ్చు. అయితే హీరో క్యారెక్టర్ తన భార్య, కూతురు మీద ఏమాత్రం జాలి, దయ లేకుండా ప్రవర్తిస్తుంది. ఇతడికి తప్పించుకొని భార్య ఎక్కడికో పారిపోతుంది.. ఆయన కూతురు యుక్త వయసుకు వచ్చేంతవరకు, ప్రతిభను నిరూపించుకునేంతవరకు ఇతడికి భార్య, పిల్లలు గుర్తుకురారు.

రెండవ క్యారెక్టర్ ను అచ్చంగా పశు ప్రవృత్తిని పోలిన విధంగా డిజైన్ చేశారు. పైకి మంచిగానే కనిపిస్తుంది. కానీ మద్యం తాగిన తర్వాత తీవ్రమైన ఘాతుకాలకు వెనుకాడని పాత్ర ఇది. ఈ రెండు పాత్రల తండ్రి పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో మరింత దారుణంగా ప్రవర్తిస్తుంది. ఇలాంటి మనుషులు సమాజంలో ఉండరని కాదు. మన నిజ జీవితంలో నిత్యం చదువుతున్న నేర వార్తలకు సంబంధించి ఇలాంటి కథనాలు చదువుతూనే ఉంటాం. చూస్తూనే ఉంటాం. కానీ ఇలాంటి పాత్రలను తెరపై చూస్తే మాత్రం వణికి పోతాం. ఇలాంటి పాత్రను చేయడానికి జోజూ జార్జి చేసింది సాహసం అనే చెప్పొచ్చు.
ఇరట్టా కథ, కథనాల విషయంలో ఎక్కడా తడబాటు లేకుండా దర్శకుడు ఒక రా స్టోరీని తెరకెక్కించారు. పాత్రలను సాధారణ భావోద్వేగాల మధ్య నుంచి చూసే ప్రేక్షకులు కచ్చితంగా ఇబ్బంది పడతారు.. అంతేకాదు జోజూ బాబీ జార్జ్ కు ఇప్పుడు బంపర్ ఆఫర్ తగిలింది. వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలో విలన్ గా నటించేందుకు అక్షరాల కోటిన్నర తీసుకుంటున్నాడు. అతని వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు ఇందుకు అదనం. ఇక ఇలాంటి సినిమానే మరొకటి ఓటీటీలో దుమ్ము రేపుతోంది. మమ్ముట్టి నటించిన క్రిస్టోఫర్ కూడా క్రైమ్ థ్రిల్లర్ జోనరే. సినిమా మొత్తం అమ్మాయిలపై ఘాతుకాల గురించే. క్రైమ్ అండ్ పనిష్మెంట్ కథనం ఈ సినిమా సాగుతుంది. అత్యాచార ఘటనలను తెరపై చూపించిన వైనం కలత కలిగిస్తుంది.. అన్నట్టు ఈ సినిమాలు చూస్తున్న ప్రేక్షకులకు డెన్సిటీని వివరించేందుకు దారుణమైన దృశ్యాలు చూపించాల్సిన అవసరం లేదనే ఫీలింగ్ తప్పనిసరిగా కలుగుతుంది.